Good news for farmers in AP .. Rs 7,000 per bank accounts.
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ.. డబ్బులు రాకపోతే ఇలా చేయగలరు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ పంట వేస్తే లాభాలు వస్తాయన్నది అధ్యయనం చేసి వారికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు.
సూపర్ సిక్స్ లో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెంలో ప్రారంభించారు. పచ్చని పొలాల్లో రైతుల మధ్య కూర్చుని ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కర్షక సోదరులతో కలిసి పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రైతులతో కాసేపు ముచ్చటించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో గత ప్రభుత్వానికి.. కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఎంత మేర ఉందో చూడాలని సీఎం అన్నారు. ఎన్నికల్లో చేసిన ప్రకటన మేరకు రైతులకు ఏటా రూ.20,000 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చామన్నారు. ఈ పథకం ద్వారా 3 విడతల్లో రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా పచ్చని పొలాలు, దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున జమ చేశాం. దీనికోసం రూ.2,343 కోట్ల నిధుల్ని కేటాయించామన్నారు. మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,000 చొప్పున రూ.832 కోట్లు ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం-రాష్ట్ర వాటాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేశామని తెలిపారు. ఈ విడతలో రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది కలుగుతోందన్నారు.
పథకం అమలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఫిర్యాదులు, సందేహాలు ఉన్నా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని ఆర్ఎస్ కే లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే 155251 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు
0 Response to "Good news for farmers in AP .. Rs 7,000 per bank accounts."
Post a Comment