Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Traffic Challans: GoodNews .. Are there challans on your vehicle? Half of the money!

 Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

Traffic Challans: GoodNews .. Are there challans on your vehicle? Half of the money!

చాలా మంది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. పోలీసులు ఎంత కఠినమైన నిబంధనలు పెట్టినా.. రూల్స్‌ తుంగలో తొక్కుతుంటారు. అలాంటి వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కటినంగా వ్యవహరిస్తుంటారు.

సాధారణంగా చాలా మంది హెల్మెట్‌ ధరించరు. అలాగే త్రిబుల్‌ రైడింగ్‌ కూడా చేస్తుంటారు. దీంతో పోలీసులు వారికి చలానాలు విధిస్తుంటారు. అలాగే నో పర్కింగ్‌ ప్రాంతాల్లో కూడా పార్క్‌ చేయడం వల్ల పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని పెనాల్టీ ఛార్జీలు ఉన్నా చెల్లించకుండా అలాగే ఉంటారు. అలాంటి వారి కోసం పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు ఓ అవకాశం ఉంటుంది. అందులో దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్‌తో చలానాలు చెల్లించవచ్చు. అయితే గతంలో తెలంగాణలో భారీగా చలాన్లు నమోదు అయిన నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం సామాన్యులకు చాలా సులభమైన, ఉపశమనం కలిగించే మార్గాన్ని అందిస్తోంది. అదే లోక్ అదాలత్‌. ఇలాంటి సమస్యలు, కేసులను సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ అనేది ప్రజల కోర్టు. ఇది కేసులను సామరస్యంగా పరిష్కరించుకునే ఒక వేదిక. దీనిని “ప్రజా న్యాయస్థానం” అని కూడా అంటారు. సాధారణంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న లేదా న్యాయస్థానంలో దావా వేయడానికి ముందు దశలో ఉన్న కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. ఇది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుంది.

మీరు మీ చలాన్ పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా సగం మాత్రమే చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే మీపై భారీ పెనాల్టీ ఛార్జీలు ఉంటే అందులో సగం మాఫీ అవుతాయి. దీని సహాయంతో మీరు చలాన్ భారం నుండి కూడా బయటపడవచ్చు.

లోక్ అదాలత్ ఎప్పుడు జరుగుతుంది?

మొదట తలెత్తే ప్రశ్న ఏమిటంటే ఈ లోక్ అదాలత్ ఎప్పుడు జరుగుతుంది అని. లోక్ అదాలత్ సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుంది. అందువల్ల మీరు మీ నగరం లేదా రాష్ట్రం న్యాయ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా మీ స్థానిక కోర్టును సంప్రదించడం ద్వారా తదుపరి లోక్ అదాలత్ తేదీ గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో తదుపరి లోక్ అదాలత్ సెప్టెంబర్ 13, 2025న రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఈ లోక్‌ అదాలత్‌ తేదీలు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉండవచ్చు. ఇందులో పరిష్కారం పొందాలంటే ముందుగా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు 2 రోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. దీనిలో మీకు అపాయింట్‌మెంట్ లభిస్తుంది. టోకెన్ నంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఈ టోకెన్ నంబర్, అపాయింట్‌మెంట్ లెటర్, అవసరమైన పత్రాలతో మీరు సకాలంలో లోక్ అదాలత్‌కు చేరుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

మీకు ఒకటి కంటే ఎక్కువ చలాన్లు ఉంటే, ముందుగా మీరు విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లోక్ అదాలత్‌లో హాజరు కావాలి. అక్కడ మీరు మీ చలాన్‌ను మాఫీ చేసుకోవచ్చు.

చలాన్‌ను ఎలా తనిఖీ చేయాలి?

మీరు అధికారిక వెబ్‌సైట్ echallan.parivahan.gov.in ని సందర్శించడం ద్వారా లేదా mParivahan యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మీ చలాన్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. దీని తర్వాత మీ చలాన్ నంబర్, వాహన నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. దీని తర్వాత క్యాప్చా కోడ్‌ను పూరించండి. మీ చలాన్ వివరాలు మీకు కనిపిస్తాయి. తర్వాత మీ చలాన్ ప్రింటవుట్ తీసుకొని షెడ్యూల్ చేసిన తేదీన లోక్ అదాలత్‌కు వెళ్లండి.

ఏయే చలాన్లను మాఫీ చేయవచ్చు?

హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, తప్పుగా పార్కింగ్ చేయడం వంటి పాత ట్రాఫిక్ చలాన్ కేసులను లోక్ అదాలత్‌లో విచారిస్తారు. కొన్ని సందర్భాల్లో మొత్తం జరిమానాను మాఫీ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో 50 శాతం అంటే మీ చలాన్‌లో సగం మాఫీ కూడా అవుతుంది. అంటే ఇందులో మీ కేసు విచారణ బట్టి పరిష్కారం లభిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Traffic Challans: GoodNews .. Are there challans on your vehicle? Half of the money!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0