Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All ZP / MP Schools are merged in municipal premises in Municipal schools - details

విలీనానికి గ్రీన్‌సిగ్నల్‌

★ నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీల పరిధిలో ఇతర యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.

★ పాఠశాల విలీనానికి మార్గం సుగమం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి గురువారం ఉత్తర్వులు జారీ.

★ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1994 ప్రకారం విస్తృత పరిధి ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఇతర యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ పాఠశాలలను ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఆమోదం.

★ దీనికోసం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మున్సిపాలిటీల్లో తమ సేవలను విలీనం చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాల్సి ఉంది.

★ బోధన, బోధనేతర సిబ్బంది అనుమతితో వారిని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తారు.

★ సంబంధిత ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ఇతర యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు తగు ప్రతిపాదనలను పంపించమన్నారు.

*🍥 కోరిన వివరాలు ఇవి*

★ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇతర యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించి 8రకాల వివరాలను  కోరారు.

★ మున్సిపాలిటీలు, నగరపాలకసంస్ధ పరిధిలోని గ్రామాలు, మండలాల వివరాలు, ఆయా గ్రామాల్లో ఏయే యాజమాన్యం అంటే ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలల వివరాలు గ్రామాలు, మండలాలవారీగా ఇవ్వాలి.

★ ప్రతి పాఠశాలలోని విద్యార్ధుల సంఖ్య, పాఠశాల వారీగా, కేటగిరీ వారీగా ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

★ ఎంతమంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు, ఆయా పాఠశాలల తనిఖీ అధికారి వివరాలు, ఆయా గ్రా మాలు, మండలాలు ఎప్పుడు నగరపాలకసంస్థ, మున్సిపాలిటీల్లో విలీనమైంది తెలిపేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ మున్సిపాలిటీల్లో విలీనమయ్యేందుకు బోధన, బోధనేతర సిబ్బంది అంగీకార పత్రాలు తీసుకుని వెంటనే సమర్పించమని డీఈవో ఉపవిధ్యాధికారులు, ఎంఈవోలను ఆదేశాలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All ZP / MP Schools are merged in municipal premises in Municipal schools - details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0