Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government is preparing the sector for the replacement of teacher posts.


  • టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
  • ముందే టెట్ . . జనవరిలో కొత్త డీఎస్సీ . . 
  •  ఇంగ్లీషు మీడియం సబ్జెక్టులకే ప్రాధాన్యం . . !నోటిఫికేషన్లకు ప్రభుత్వం సిద్ధం 
  • 20వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలు 
  •  నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట .

The government is preparing the sector for the replacement of teacher posts.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది . డిసెంబరులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ ) నిర్వహించే ఆలోచనలో ఉంది . ఆ తర్వాత జనవరిలో నూతన డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి . . ఏప్రిల్ / మేలో పరీక్షలకు కేలెండర్లు రూపొం దించాలని ప్రాథమికంగా నిర్ణయించించినట్లు తెలు స్తోంది . విద్యాశాఖా ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష అనంతరం ఖాళీల భర్తీకి | కేలెండర్ రూపొందించాలని ఆదేశించడంతో నూతన  _ డీఎస్సీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది .ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై జగన్ దృష్టిపెట్టారు . సీఎం ఆదేశాల మేరకు జన - వరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ' | విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు .

పోస్టుల భర్తీకి కసరత్తు

డీఎస్సీ - 2018 ప్రకటన విడుదల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 20వేలకుపైగా ఖాళీలు ఉండగా . . అందులో కేవలం 7902 పోస్టులకే టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఆ సమయంలో దాదాపు14వేల ఖాళీలు మిగిలిపోయాయి . అప్పటి నుంచి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతోపాటు ఇతరత్రా ఖాళీలు కలుపుకుని 20వేల నుంచి 25 వేలకు ఖాళీలు . ఉండొచ్చని ఒక అంచనా . రాబోయే డీఎస్సీ పరీక్ష సిలబస్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయని సమాచారం .

ఇంగ్లీషు మీడియం పోస్టులకే ప్రాధాన్యత 

 రాబోయే డీఎస్సీలో ఇంగ్లీషు మీడియం ( అన్ని సబ్జెక్టులకు ) అత్యంత ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి . 7030 నిష్పత్తిలో 70శాతం ఇంగ్లీషు మీడియం , 30శాతం తెలుగు మీడియం ) పోస్టుల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది . అయితే తెలుగు సబ్జెక్టుకూ సముచిత స్థానం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది . ప్రభుత్వ పాఠశాలల్లో తొలి విడతగా 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లీషు మీడియంలో బోధించాలని నిర్ణయించారు . ఆ తర్వాత 9 , 10 తరగతులకు ఇంగ్లీషు మీడి యాన్ని విస్తరించనున్నారు . దీన్ని దృష్టిలో ఉంచు కుని సర్వీసులో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయు లను హైదరాబాద్లోని ఇపూకు పంపనున్నారు .

టెట్ అర్హత తప్పనిసరి . . ! 

 డీఎస్పీ రాయాలంటే ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి అభ్యర్థి టెట్లో అర్హత సాధించాల్సిందే . విద్యాహక్కు చట్టం ( ఆర్టీఈ ) - 2009 ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను నిర్వహిస్తున్నారు . ఆర్టీఈ నిబంధనల ఆధారంగా ప్రతి ఏటా ( ఆర్నెళ్లకోసారి ) ప్రభుత్వం టెట్లు నిర్వహించాలి . గత పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విడత డీఎస్సీ కంటే ముందస్తుగానే టెట్ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం . నెల రోజుల్లో టెట్ నోటిఫికేషన్ పై స్పష్టత వచ్చే అవకాశముంది .

సిలబస్ పై స్పష్టత ఇవ్వాలి 

నూతన డీఎస్సీలో సిలబస్ పై పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి . దీంతో ముందస్తుగా సిలబస్ పై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు . టెట్ , డీఎస్పీలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహించనుంది . టెట్ - 2018 డీఎస్సీ - 2018 తరహానే దాదాపుగా సిలబస్ ఉంటుందని భావిస్తున్నారు . పాత సిలబస్ ఆధారంగానే టెట్ , డీఎస్సీలు నిర్వహిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని , గత ఏడాది తరహాలో తుది దశలో సిలబసను కొత్తగా మార్పు చేస్తే అభ్యర్థులు గందరగోళానికి గురయ్యే అవకాశముంది అభ్యర్థులు భావిస్తున్నారు . ఇప్పటికే డీఎస్సీ - 2018లో తెలుగు , ఇంగ్లీషు పండిట్లకు సిలబసను అదనంగా రూపొందించ డంతో అభ్యర్థులు న్యాయ స్థానాల్ని ఆశ్రయించారు . ఇప్పటివరకు తెలుగు , హిందీ లాంగ్వేజ్ పండిట్స్ , స్కూల్ అసిస్టెంట్స్ ( ఎస్ఏ ) పోస్టులకు మెరిట్ జాబితాను రూపొందించలేదు . గత సంఘటనల్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని టెట్ , డీఎస్సీ సిలబసను సబ్జెక్టుల వారిగా ముందస్తుగా ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "The government is preparing the sector for the replacement of teacher posts."

  1. సార్ దయచేసి English మీడియం పోస్ట్ లకు తెలుగు మీడియం లొ చదివిన అభ్యర్థులకు కూడ అవకాశం కల్పించండి. 2011 లో ssc complte అయ్యింధి అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేధు సార్ మెము ఇప్పుడు TTC చెసి DSC కోసం ఎదురుచూస్తూనం మీరు DSc లో English మీడియం లో చదివిన వారికే Importence ఇస్తే మేము అన్యాయం అయిపోతాం సార్

    ReplyDelete
  2. Sir I havecompleted ssc in 2009 in Telugu medium sir.But I have completed TTC.pls give impotance for Us also sir.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0