Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Getting a driving license now is much easier

ఇప్పుడు   డ్రైవింగ్ లైసెన్సు మరింత సులువుగా !
Getting a driving license now is much easier

  •  రవాణాశాఖలో వాక్ ఇన్ లెర్నింగ్ లైసెన్స్
  •  ఎల్ ఎల్ ఆర్ కు డ్రైవింగ్లో నైపుణ్యం ఉంటే చాలు
  •  కంప్యూటర్ పరిజ్ఞానం , చదువులేని వారికి ఊరట
  •  ద్విచక్ర వాహనానికి రూ . 200
  • కారు లైసెన్స్ ( ఎల్ ఎంవీ ) కోసం రూ . 410
  •  శాశ్వత లైసెన్స్ కి అదనంగా చెల్లించాలి . .
  • అమల్లోకి వచ్చిన కొత్త విధానం - - - - -

లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్.ఎల్.ఆర్)

 రవాణాశాఖ ఆధికారులు పెట్టే పరీక్షల్లో నెగ్గుకు రావాలి . తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు . ఈ రెండూ పొందా లంటే కనీస విద్యార్హత , కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ఇదంతా గతం . ఇప్పుడు ఏమీ చదువుకోకపోయినా , కంప్యూటర్ భాష తెలియకపోయినా డైవింగ్లో నైపుణ్యం ఉంటే చాలు . ఈ శాఖ సిబ్బంది ఆడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే లైసె న జారీ అవుతోంది

 సగంమందికి లైసెన్సుల్లేవు . .

రవాణా శాఖలో తాజాగా ' వాక్ ఇన్ లెర్నింగ్ లైసెన్స్ విధానం గతనెల నుంచి అమల్లోకి వచ్చింది . ఇందులో శైవింగ్ లైసెన్స్ ఆనుమతికోసం ఇప్పటివరకూ అమల్లో ఉన్న విధానాన్ని సంస్కరించారు . దీంతో కొన్ని ప్రశ్నలను సిబ్బంది దరఖాస్తుదారులకు చదివి వినిపిస్తారు . వాటికి చెప్పే సమాధానాల్లో ఇరవైకి పన్నెండు   కరెక్ట్ గా చెప్పగలగాలి . వాటిని సిబ్బంది నోట్ చేసుకుని కక్షిదారులకు ఎల్ఎల్ఆర్ కోసం సిఫారసు చేస్తారు .
ఐదేళ్ల క్రితంతో పోల్చి చూస్తే ఇటీ వలకాలంలో వాహనాల కొనుగోలు శాతం పెరి గింది .

ద్విచక్ర వాహనాలనుంచి కార్లు , జీపులు , బస్సులు , లారీలు , ట్రాక్టర్ల సంఖ్య ఎక్కువైంది . వీటిని నడుపుతున్న వారిలో నూటికి 50శాతం మందివద్ద లైసెన్స్లు ఉండడం లేదని రవాణాశాః ఆధికారుల తనిఖీల్లో గుర్తించారు . లైసెన్స్ లేని డ్రైవింగ్వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి . లైసెన్స్ రహిత వాహనదారులపై ఎన్ని కేసులు నమోదు చేసినా పెనాల్టీలు వేసినా పరిస్థితిలో మార్పు కని పించడం లేదు . ఎల్ఎల్ఆర్ జారీ కోసం క్యాంపెయిన్ లు నిర్వహిస్తున్నా ఆశాజనకమైన ఫలితాలు రావడంలేదు . ఆనుకోని సంఘటనల్లో ప్రమాదాలు జరిగితే , జరిగిన నష్టానికి బీమా రావాలన్నా లైసెన్స్ లేకపోవడంతో ఆది వర్తించడం లేడు . దీనిపై కసరత్తు చేసిన వాహనం నడిపే ప్రతిఒక్కరూ లైసెన్స్ పొందాలని ఇప్పుడు కొత్త విధానాన్ని ఆమ ల్లోకి తీసుకువచ్చారు.

 సడలింపులు

ఇకనుంచి వాహనం ఉన్న ప్రతిఒక్కరికీ లైసెన్స్ తప్పనిసరి
ఇందుకు ఎల్.ఎల్. ఆర్ జారీలో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులను సడలించి సరళీకరించారు . ప్రస్తుతం ఎల్.ఎల్.ఆర్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుని ఆపై ఇచ్చిన సమయానికి ఆర్డీవో , ఎంవీఐ కార్యాలయాలకు వెళ్లి సాట్ బుక్ చేసుకోవాలి . తర్వాత కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి . దీనికి చదువులేని , కంప్యూటర్ అవగాహన లేని వారు గతంలో నానా ఇబ్బందులు పడేవారు . ఇప్పుడు అవేమీ లేకుండా వాడికి లెర్నింగ్ లైసెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు . ఇప్పుడు మీ సేవలో దరఖాస్తు చేయనక్కర్లేదు . ప్రత్యేకంగా నిర్వహించే శిబిరాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైన వారు వేస్తే చాలు . అక్కడే ఏటీఎం కార్డు ద్వారా నెల్లో అవసరమైన స్త్రీ చెల్లిం దాలి . తర్వాత వాహనం నడిపే సమయంలో రహదారి భద్రతకు తీసుకునే జాగ్రత్తలపై వాహనదారులను 30 ప్రశ్నలను సిబ్బంది అడుగుతారు . వాటికి 12 సమాధానాలు కచ్చితంగా చెప్పాలి . ఇవన్నీ పూర్తి చేస్తే ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు .
వెంట ఇవి తప్పనిసరి

 ఎల్ఎల్ఆర్ కోసం వెళ్లే వారు వెంట క్రింది వానిని తీసుకు వెళ్ళాలి.

  • ఆధార్ ,పర్మినెంట్ చిరునామా తీసుకెళ్లాలి 
  • 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు 
  • ద్విచక్ర వాహనదారుల వెంట హెల్మెట్ తప్పనిసరి గా ఉండాలి . 
  • విద్యార్హత , వయస్సు ధ్రువీకరణ లేక పోతే వైద్యుడి ద్వారా ధ్రువీకరించిన లెటర్ తీసుకెళ్లాలి . 
  • ద్విచక్ర వాహనానికి రూ . 200, 
  • కారు లైసెన్స్ (ఎల్ఎంవీ) కోసం రూ . 410 చెల్లించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Getting a driving license now is much easier"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0