Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Life skills in you

మీలో జీవన నైపుణ్యమెంత?

3 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం
చిన్న వయసు నుంచీ జీవన నైపుణ్యాలను నేర్చుకోవడం ఈ రోజుల్లో  తప్పనిసరి. విద్యార్థుల్లో ఇవి ఎంతమేరకు ఉంటున్నాయో సింగపూర్‌కు చెందిన సంస్థ- స్కిలిజెన్‌ లర్నింగ్‌ ఫౌండేషన్‌  ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌స్కిల్స్‌ ఒలింపియాడ్‌’ (ఐఎల్‌ఎస్‌ఓ) ద్వారా పరీక్షిస్తోంది. డిసెంబరు 14, 15 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది.  ఈ పోటీలో విజేతలైనవారికి  సర్టిఫికెట్లూ, బహమతులను అందజేస్తారు.
Life skills in you

నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితంలో ముందుకు సాగడం వీలవుతుంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధన ప్రకారం 6 నుంచి 16 ఏళ్ల వయసు నుంచే వీటిపై పిల్లల్లో అవగాహన కల్పించడం ద్వారా వారిని మెరుగైన భవిష్యత్తుకు సిద్ధం చేయొచ్చు. ఇదే ఉద్దేశంతో స్కిలిజెన్‌ సంస్థ లైఫ్‌స్కిల్స్‌పై ఆసక్తిని కలిగిస్తోంది. అంతర్జాతీయ పరీక్ష... ఐఎల్‌ఎస్‌ఓ ద్వారా విద్యార్థుల లైఫ్‌స్కిల్స్‌ ఆప్టిట్యూడ్‌ను పరీక్షిస్తోంది.
మూడు నుంచి పన్నెండు తరగతులవారు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్షలో భాగంగా వాస్తవ సంఘటన ఆధారంగా ప్రశ్నలను అడుగుతారు. దీనిలో పాల్గొనడం ద్వారా వారి నైపుణ్యాలను తెలుసుకోవడంతోపాటు కొత్తవాటిని నేర్చుకునే వీలుంటుందని సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఈ ఒలింపియాడ్‌లో 100కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి.
విద్యార్థులను 4 గ్రూపులుగా విభజిస్తారు.

గ్రూప్ ల వివరాలు

* గ్రూప్‌-1లో మూడు నుంచి ఐదు తరగతులవారు
* గ్రూప్‌-2లో 6 నుంచి 8 తరగతులవారు
* గ్రూప్‌-3లో తొమ్మిది, పది తరగతులవారు
* గ్రూప్‌-4లో 11, 12 తరగతులవారు ఉంటారు.
గ్రూపును బట్టి ప్రశ్నించే అంశాల్లో తేడా ఉంటుంది. ముఖ్యంగా నాయకత్వం, నిర్ణాయక శక్తి, నైతిక సూత్రాలు, లక్ష్య ప్రణాళిక, సమయ నిర్వహణ, సంప్రదింపులు వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను పరీక్షిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. పరీక్ష సమయం గంట. ఈ సమయంలో గ్రూప్‌-1వారు 40 ప్రశ్నలకూ, గ్రూప్‌-2 వారు 50 ప్రశ్నలకూ, గ్రూప్‌-3వారు 60 ప్రశ్నలకూ, గ్రూప్‌-4 వారు 70 ప్రశ్నలకూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రశ్నలను అనుభవమున్న విద్యానిపుణులు, సైకాలజిస్టులు, పరిశ్రమ నిపుణులతో కూడిన గ్లోబల్‌ టీం రూపొందిస్తుంది. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది.
సన్నద్ధత: వెబ్‌సైట్‌లో సిలబస్‌, లైఫ్‌ స్కిల్స్‌ గైడ్‌, ప్రాక్టీస్‌ ప్రశ్నలు ఉంటాయి. గ్రూపులవారీగా మాదిరి పరీక్షలూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు కట్టిన వారందదరూ వీటిని సాధన చేసుకోవచ్చు.
బహుమతులు: ప్రతి గ్రూపు నుంచీ గెలిచిన టాప్‌ ర్యాంకర్లకు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ సందర్శనకు ఉచిత టికెట్లు అందజేస్తారు. అన్ని గ్రూపుల రన్నరప్‌లకు ఐపాడ్‌, కిన్‌డిల్స్‌ ఇస్తారు. పాల్గొన్నవారందరికీ డిజిటల్‌ సర్టిఫికెట్లతోపాటు ప్రైజ్‌లు ఉంటాయి.

దరఖాస్తు ఎలా?

విద్యార్థి సొంతంగా/ విద్యార్థి తరఫున తల్లిదండ్రులు/ స్కూలు తరఫున దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ (www.lifeskillsolympiad.org) లో లేదా ఈ-మెయిల్‌ sinfo@lifeskillsolympiad.org) లో వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. మీడియంతో సంబంధం లేదు. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. కాబట్టి, ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.490. ఫలితాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Life skills in you"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0