There are many opportunities with Distance education .
There are many opportunities with Distance education.
వివిద కారణాలతో విద్యకు దూరమైన వారు తిరిగి తమ విద్యా భ్యాసం కొనసాగించేందుకు విద్యాశాఖ దూర విద్యా విధానంలో సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీ ఓపెన్ స్కూల్ ) అవకాశం కల్పిస్తోంది . చద వడం , రాయడం వచ్చిన 14 సంవత్సరాలు కలిగిన వారు దూరవిద్యా విధానంలో పదో తర గతి , ఇంటర్ చదువుకోవచ్చు . ఆసక్తిగల అభ్య ర్డుల నుంచి 2019 - 20 సంవత్సరానికి దర ఖాస్తులు అధ్యయన కేంద్రాల వద్ద స్వీకరిస్తు | న్నారు . ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ / ఇంటర్.
2015 - 16 2179 2274 2369 1492
2016 - 17 4252 2809 3011 2048
2017 - 18 5228 397O 3482 2215
2018 - 19 5974 2746 4168 1928
- సార్వత్రిక విద్యతో సదవకాశాలు..
- ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ..
- టెన్త్, ఇంటర్ అభ్యసించేందుకు అవకాశం.
- గడువు తేది 30.09.2019 పొడిగించబడినది.
వివిద కారణాలతో విద్యకు దూరమైన వారు తిరిగి తమ విద్యా భ్యాసం కొనసాగించేందుకు విద్యాశాఖ దూర విద్యా విధానంలో సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీ ఓపెన్ స్కూల్ ) అవకాశం కల్పిస్తోంది . చద వడం , రాయడం వచ్చిన 14 సంవత్సరాలు కలిగిన వారు దూరవిద్యా విధానంలో పదో తర గతి , ఇంటర్ చదువుకోవచ్చు . ఆసక్తిగల అభ్య ర్డుల నుంచి 2019 - 20 సంవత్సరానికి దర ఖాస్తులు అధ్యయన కేంద్రాల వద్ద స్వీకరిస్తు | న్నారు . ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ / ఇంటర్.
ఫీజు వివరాలు
- 10 వతరగతికి పురుషులకు రిజిస్ట్రేషన్ ఫీజు కలుపుకొని ( 5 సబ్జెక్టులకు ) రూ1,400 , అదనపు సబ్జెక్టకు రూ 150 చెల్లించాలి
- ఇంటర్మీడియెట్ అభ్యర్థులు పురుషులకు రిజిస్ట్రేషన్ ఫీజు కలుపుకుని రూ . 1,600 అదనపు సబ్జెక్ట్ కు రూ . 200 చెల్లించాలి
- ఎస్సీ / ఎస్టీ , బీసీ , మైనార్టీ / దివ్యాంగు లు / మాజీ సైనికోద్యోగల పిల్లలకు / అన్ని వర్గాల స్త్రీలకు టెన్తకు రూ1,000 , ఇంటర్ కు రూ . 1,300లు
- ఈనెల 26వ తేదీ లోపు మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించాలి . ( సర్వీస్ చార్జి అదనం )
- అభ్యసనకు సంబంధించిన అడ్మిషన్ దర ఖాస్తుల స్వీకరణ ఈనెల 26వ తేదీతో ముగియ నుంది .
- ఆ వివరాలు తెలుసుకుందాం .
- ఉన్నత విద్యకు మార్గం
- ఉద్యోగాలు , పదోన్నతులు పొందేందుకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ మార్గం ఎంతో ఉపయుక్తం .
- జిల్లాలో సార్వత్రిక విద్యాపీ టం స్టడీ సెంటర్లు 65 ఉన్నాయి .
- ఈ విధానంలో విద్యా విషయక సబ్జెక్ట్లతోపాటు వృత్తి విద్యా సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి .
- ఈ ధ్రువపత్రం ద్వారా ఉన్నత చదు వులు , వృత్తి విద్యా కోర్సులు అభ్యసించవచ్చు .
- ఇంటర్ సైన్స్ గ్రూపులో చేరేవారు జూనియర్ కళాశాల స్టడీ సెంటర్లలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి .
- ఈ కోర్సులు పూర్తి చేసేందుకు కనీస వయోపరిమితి నిబంధన లేదు .
- ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందిన 5 ఏళ్లలో 9 సార్లు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది .
- ఈ కోర్సు లు తెలుగు / ఇంగ్లిష్ / ఉర్దూ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి .
దరఖాస్తుతోపాటు సమర్పించాల్సినవి
- మున్సిపల్ అధికారి / తాహసీల్దారు / జనన రిజిస్టర్ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రం
- లేదా ఏదైనా పాఠశాల రికార్డు షీటు / టీసీ ( రెండు జిరాక్స్ కాపీలు )
- ఇంటర్మీడియెట్ దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన ఎస్ఎససీ బోర్డు సర్టిఫికెట్ తాజాగా జారీ చేసిన నివాస , కుల ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తులు ఉచితం
- జిల్లాలో మొత్తం 65 ఓపెన్ స్కూల్ కేంద్రాలు ఉన్నాయి అక్కడ దర ఖాస్తులు ఉచితంగా అందిస్తారు .
- సంబంధిత వివరాలను అభ్యర్డులు మీసేవ , ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి .
- పాసపోర్ట్ సైజు ఫొటో , అభ్యాసకుని సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యా లి .
- ఆన్లైన్ దరఖాస్తు అనంతరం దరఖాస్తు తోపాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కు వారంలోపు సమర్పించాలి .
- అనంతరం స్టడీ సెంటర్లో అడ్మిషన్ నంబర్ , గుర్తింపు కార్డు జారీ చేస్తారు .
- పాఠ్యపుస్త కాలను ఉచితంగా అందిస్తారు .
ఎన్నో ప్రయోజనాలు
- చదువు మధ్యలో ఆపేసిన వారికి సార్వత్రిక పాఠశాలల్లో టెన్త్ , ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది .
- టెన్త్ పూర్తయితే ఇంటర్లో ప్రవేశించవచ్చు .
- ఇంటర్ తర్వాత డిగ్రీ , ఇంజినీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సులు చదవవచ్చు .
- ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుంటుంబాల్లో కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందేందుకు అవసరమైన టెన్స్ , ఇంటర్ చదివి మంచి శ్రేణి ఉద్యోగం పొంద వచ్చు .
- కింది స్థాయి ప్రైవేటు / ప్రభుత్వ ఉద్యోగి పదోన్నతి పొందేందుకు కూడా సార్వత్రిక పాఠశాల విద్య ఉపయోగకరం.
- హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఈ సర్టిఫికెట్ పరిగణలోకి తీసుకుంటారు .
- డీఎడ్ , బీఈడీ వంటి టీచర్స్ కోర్సులు ఈ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్తో అభ్యసించవచ్చు .
మార్కుల బదలాయింపు ఇలా
- గతంలో ఎస్ఎససీ / ఇంటర్ బోర్డుల నుంచి పాసైన ఏవేని 2 సబ్బెక్ మార్కు లను 10వ తరగతి / ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ కు బదలాయిం చుకునే అవకాశం ఉంది .
- ఓపెన్ స్కూల్ల్లోని ఏదైనా కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి నుండి ఐదేళ్ల పాటు ప్రవేశం చెల్లుబాటు ఉంటుంది .
- అధ్యయన కేంద్రాల్లో మొత్తం 30తరగతులు నిర్వహిస్తారు
- కనీసం 24 తరగ తులకు కచ్చితంగా హాజరుకావాలి .
- తర గతులకు హాజరై అసైన్ మెంట్ పూర్తి చేసిన అభ్యసకులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇస్తారు .
- మరిన్ని వివరాలకు ఏపీఓపెన్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు .
నాలుగేళ్లుగా విద్యార్థుల నమోదు,ఉత్తీర్ణత వివరాలు
విద్యా సంవత్సరం టెన్త్ ఉత్తీర్ణత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత2015 - 16 2179 2274 2369 1492
2016 - 17 4252 2809 3011 2048
2017 - 18 5228 397O 3482 2215
2018 - 19 5974 2746 4168 1928
0 Response to "There are many opportunities with Distance education ."
Post a Comment