Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About 10 th Class New modal question paper

ముఖ్యాంశాలు:

  • కార్పొరేట్ రుద్దుడుకు కాలం చెల్లు 
  •  జీపీఏల జిమ్మిక్కులు బంద్ 
  •  మింగుడు పడని ప్రభుత్వ నిర్ణయం 
  • బట్టి పట్టి పది గట్టెక్కడం కష్టమే 
  •  నూతన మోడల్ పై భిన్నస్వరాలు 
  •  చాయిస్ తొలగించడంతో ఒత్తిడి 
  • అవగాహన కల్పించి అమలు చేస్తే ప్రయోజనం 

About 10 th Class New modal question paper

  పదో తరగతి ప్రశ్నాపత్రం మోడల్ ను మారుస్తూ విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన బ్లూప్రింట్ తో కార్పొరేట్ బట్టీలకు కాలం చెల్లినట్లే కానుంది . విద్యార్థులను బట్టీ పట్టించడం ద్వారా జీపీఏలు పెంచాలనుకుంటే ఇంక కుదరనట్లే . కొత్త మోడల్ ప్రకారం చాయిస్ లేని ప్రశ్నలు 28 ఉండటం వల్ల ఎక్కువ సిలబస్ ను కవర్ చేయాల్సి ఉంటుంది . అందువల్ల ముఖ్యమైనవి మాత్రమే బట్టి కొట్టిద్దామనుకుంటే ఏ మాత్రం కుదరదు . ఇప్పటి వరకు పదికి పది , పదికి తొమ్మిదిపైగా జీపీఏలు వచ్చాయంటూ ప్రకటించుకుంటున్న మెజారిటీ కార్పొరేట్ , ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడకుండా తయారైంది . 

ఈ ప్రశ్నాపత్రం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా , వారిలోని విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించేలా , అవగాహనా శక్తిని మేల్కొల్పేలా ఉందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు . అయితే ఈ ప్రశ్నాపత్రం విద్యాసంవత్సరం మధ్యలో తేవడం వల్ల విద్యార్థులపై ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి . విద్యావ్యవస్థలో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపట్టడం మంచిదే అయినా కీలకమైన పదో తరగతి విషయంలో ఇంత గోప్యత , ఇంత ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నల్ మార్కులను తొలగించడం తో పాటు ప్రశ్నాపత్రం ప్యాటర్న్ ను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 15న నూతన మోడల్ ను ప్రకటించింది . అయితే ఈ మార్పుపై ముందునుంచే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ ప్రశ్నాపత్రం మోడల్ రూపకల్పన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు , విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పట్టించుకో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి . 

రెండున్నర గంటల్లో 33 ప్రశ్నలు 


  • పదో తరగతి నూతన ప్రశ్నాపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి . 
  • వీటిలో వ్యాసరూప ప్రశ్నలకు మినహా వేటికీ చాయిస్ లేదు . 
  • ఆబ్జెక్టివ్ టైప్ , వెరీ షార్ట్ టైప్ , షార్ట్ టైప్ ప్రశ్నలు మొత్తం రాయాల్సి ఉంటుంది . 
  • మొత్తం 33 ప్రశ్నలు రాయ డానికిగాను రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు . 
  • అలాగే ప్రశ్నాపత్రాన్ని చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాల సమయం ఉంటుంది . 
  • మెయిన్ లాంగ్వేజ్ కు మాత్రం సమయం సరిపోదని 3 గంటలు పరీక్షకు , 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదువుకోవడానికని సమయం కేటాయించారు . 
  • సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 3 గంటల సమయం ఇచ్చారు .
  •  అయితే చాయిస్ లేకపోవడం , ప్రశ్నలను నాలుగు విభాగాలు చేయడం వల్ల ఇచ్చిన సమయంలోనే పరీక్షను పూర్తి చేయడానికి విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి .
  •  అలాగే జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ఇస్తామనడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
  •  బుక్ లెట్ వల్ల మాస్ కాపీయింగ్ కు అవకాశాలుండవని కొందరు చెబుతుండగా . .
  •  దీర్ఘ సమాధానాలు రాసే ప్రశ్నలకు అదనపు జవాబు పత్రాలు ఇవ్వకుంటే నష్టపోయే అవకాశాలుంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నా రు . 
  • విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త నిర్ణయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కరిక్యులమ్ మార్చుకుని- నిర్ణీత సమయంలోనే సిలబసను పూర్తి చేయడం అటు ఉపాధ్యాయులకు , ఇటు విద్యార్థులకు కష్టతరంగా మారు తుంది .
  •  పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని మారుస్తూ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పాస్ మార్కుల నేవి సబ్జెక్ట్ వారీగా ఉంటాయా . . లేక పేపర్‌వారీగా ఉంటాయా అనేది పేర్కొనకపోవ డం విద్యార్థులను , ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తోంది . 

  • వచ్చే ఏడాది నుంచి అమలు చేయడం మంచిది : ఎంటీఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ 

  • విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కీలకమైన పదో తరగతి పరీక్షల్లో మార్పుచేర్పులు చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ . రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు . దీనివల్ల ఫలితాల్లో జీపీఏలు కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు . విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందునుంచే అవగాహన కల్పించి అప్పుడు మార్చడం మంచిది . ఈ సంవత్సరం అందరికీ అవగాహన కల్పించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "About 10 th Class New modal question paper"

  1. ప్లీస్ బ్లూ ప్రింట్ పెట్టండి

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0