Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

An article on the services provided by the postal department during the post weekend

విభిన్న పథకాలు . . విస్తృత సేవలతో పోస్టల్ శాఖ ప్రజలకు మరింత చేరువవుతోంది . ఎప్పటికప్పుడు కొత్త పథకాల తో బ్యాంకులకు దీటుగా సేవలందిస్తోంది . తపాలా శాఖ వారోత్సవాల సందర్భంగా పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలపై కథనం .
An article on the services provided by the postal department during the post weekend

 తపాలాశాఖ పరిధి

 మారుతున్న సాంకేతిక కాలానికి అనుగుణంగా సడలింపు చేసుకుంటూ అత్యాధునిక బహుళ ప్రయోజ నాలు కలిగిన తపాలాశాఖ వినూత్న సేవలను ప్రవేశపెడుతోంది . ఉత్తర ప్రత్యుత్తరాలనుంచి కోర్ బ్యాంకింగ్ వరకు తన ప్రస్థానాన్ని విస్తృత పరిచింది . ఫిలాటెలీ , ఎలక్ట్రానిక్ ఈఎంఓ , ఎంఎంటీఎస్ , టీటీడీ , సుకన్య సమృద్ధి యోజ న , మన స్టాంపు , మన ఫొటో , స్పీడ్ పోస్టు , ఎలక్రానిక్ మనియార్డర్ , మనీ ట్రాన్స్ఫర్ సర్వీ సు , మొబైల్ మనీ ట్రాన్స్పర్ వంటి సేవలు అందిస్తున్న తపాలాశాఖ త్వరతో బ్యాంకుల సేవలను కూడా అందించనుంది . . వర్డల్ నెట్ ఎక్స్ ప్రెస్ . .

వరల్డ్ నెట్ ఎక్స్ ప్రెస్ ,

ద్వారా దేశ విదేశాలో నివసిస్తున్న ఎత్పలకు వివిధ రకాల వస్తువులను 72 గంటలో పంపే సౌకర్యం తపాలాశాఖ కల్పిస్తోంది .

 స్పీడ్ పోస్టు . .

స్పీడ్ పోస్ట్ సౌకర్యం ప్రపంచీక రణలో భాగంగా విస్తృతమైనది . ప్రైవేట్ కొరియర్ల కన్న నమ్మకంగా , వేగవంతంగా బట్వాడా చేస్తూ వినియోగదారుల ఆదరాభిమా నాలు చూరగొంటోంది . ప్రభుత్వ , ప్రైవేట్ , భీమా , బ్యాంకింగ్ , చిట్పండ్ కంపెనీలు పూర్తిగా స్పీడ్ పోస్టు పైనే ఆధారపడుతున్నాయి . ఇందులో ట్రాకింగ్ విధానం ఉండడం విశేషం .

 కోర్ బ్యాకింగ్ సేవలు . .

 సాంప్రదాయ సేవింగ్స్ 1882లో ప్రారంభం కాగా కోర్ బ్యాంకింగ్ సేవలు 2014లో దేశ వ్యాప్తంగా ప్రారంభమ య్యాయి . ఇంటర్నెట్ ఆధారిత సేవలు , ప్రారం భించారు . దీంతో సేవింగ్స్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి .దేశంలో ఏ పోస్టాఫీసు నుంచైనా ఈ సేవలు పొందవచ్చు .

 మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ (ఎంఎంటీఎస్)

మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా అత్యవస రంగా డబ్బును తేలిగా ఇతరులకు పంపే సౌకర్యం కలదు . డబ్బు పంపాల్సిన వ్యక్తికి మొబైట్ ద్వారా మేసేజ్ వెళ్తుంది . వెంటనే అందుబాటులో ఉన్న తపాలా కార్యాలయానికి వెళ్లి తక్షణమే డబ్బులు పొందవచ్చు .

సుకన్య సమృద్ధి యోజన

 అప్పుడే పుట్టిన ఆడపిల్ల నుంచి పదేళ్లలోపు బాలికల తరపున వారి తల్లి లేదా తండ్రి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు పొందవచ్చు సంవ త్సరంలో వెయ్యి నుంచి రూ లక్ష వరకు పొదు పు డిపాజిట్ చేసుకోవచ్చు . 18 సంవత్సరాల వ్యవధి తర్వాత అమ్మాయికి 10 సంవత్సరాలు నిండాక రుణం రూపంలో సగం మొ త్తాన్ని , 21 సంవత్సరాల తర్వాత ప్రస్తుత వడ్డీ రేటు 9 . 1గా చెల్లించడం జరుగుతుంది . ప్రస్తుతం జిల్లాలో 25 , 207 ఖాతాలు ఉన్నాయి .

ఫిలాటెలి

స్టాంపుల సేకరణలో ఆసక్తి ఉన్నవారికి అనుకూలంగా అందమైన బొమ్మలతో రంగు రంగుల పోస్టల్ స్టాంప్లు ముద్రించి అమ్మకుం టారు . ఇవి వివిధ దేశాలో జరిగే స్టాంపుల ప్రద ర్శనలో వీటికి లక్షలు , కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు . విద్యార్థులు అధికంగా ఆసక్తి చూపే స్టాంట్లను అన్నీ తపాలాశాఖ కార్యాలయాలో అందుబాటులో ఉంచారు .

 టీటీడీ దర్శన టికెట్లు

గతంలో తిరుపతికి వెళ్లే భక్తులకు జిల్లా కేంద్రా లోనే దర్శన టికెట్లు అందుబాటులో ఉండేవి .
ప్రజలకు మరింత చేరువ కావడానికి తపా లాశాఖ టీటీడీ సౌజన్యంతో తాలూకా , మండల కేంద్రాల నుంచి కూడా టీటీడీ దర్శన టికెట్లు అందుబాటులోకి తెచ్చింది . రూ . 500 చెల్లించి దర్శన టికెట్టు ఇక్కడి నుంచే పొందే అవకాశం తపాలా శాఖ కల్పిస్తోంది .

మైస్టాంప్ , మై ఫొటో


మై స్టాంప్ , మై ఫొటో అనే వినూత్న కార్య క్రమం ప్రవేశపెట్టింది . గతంలో గొప్ప వ్యక్తులకే పరిమితమైన పోస్టల్ స్టాంప్ ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు . ఎవరైనా తమ ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంపు కోసం రూ . 300 చెల్లించి రూ . 5 విలువైన 12 స్టాంక్లను పొందే అవకాశాన్ని కల్పించింది . వీటితో పాటు అటల్ పెన్షన్ యోజన , ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన , ప్రధాన మంత్రి జీవన్ భీమా యోజన వంటి పథకాలు పోస్టల్ శాఖలో ఉన్నాయి .

పాస్పోర్ట్ సేవలు

 జిల్లాలో ఎక్కువగా జీవనోపాధి నిమిత్తం , ఉన్నత చదువులు చదువుకునేందుకు ఇతర దేశాలకు వెళ్తుంటారు . వారికి అవసరమైన పాస్ పోర్టు పోస్టల్ శాఖ అందిస్తోంది . జిల్లాలో 2017 ఏప్రిల్ 3న ప్రారంభమైన పాస్పోర్ట్ కార్యాలయం అక్టోబర్ 9 నాటికి 38 , 747 పాస్పోర్ట్ సేవలను అందించింది . రోజుకు వంద మందికి తగ్గకుండా పాస్పోర్ట్ సేవలను వినియోగించుకుంటున్నారు .

 ఆధార్ సేవలు

పోస్టల్ శాఖలో ఆధార్ సేవలు ఉన్నాయి . ఆధార్ కార్డులో మార్పులు , చేర్పులు , చిన్న పిల్ల లకు ఆధార్ నమోదు వంటి సేవలను అంది స్తోంది . జిల్లాలో 27 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను అందిస్తున్నారు . .

 తపాలా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 తపాలాశాఖ అందిస్తున్న వివిధ సేవలను జిల్లాలోని ప్రజలు సద్వినియోగ పరచుకోవా లని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "An article on the services provided by the postal department during the post weekend"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0