Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Painting competitions for students.

శక్తి ఆదాపై విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు.
25 లోగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పోటీలు
 14న రాష్ట్ర స్థాయిలో , డిసెంబర్ 14న జాతీయ స్థాయిలో పోటీలు
Painting competitions for students.

కేంద్ర ఇంధన వనరుల శాఖ ఆధ్వ ర్యంలో శక్తి ఆదా అంశంపై విద్యార్థులకు పాఠశాల స్థాయిలో పెయింటింగ్ పోటీలు నిర్వహించను న్నారు . ఏ , బీ కేటగిరిల్లో పాఠశాలల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కేంద్ర ఇంధన వనరుల శాఖ నుంచి జిల్లా విద్యాశాఖకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి . 4 , 5 , 6 తర గతులు చదువుతున్న విద్యార్థులను ఏ - విభాగం లో , 7 , 8 , 9 తరగతులు చదువుతున్న విద్యార్థు లను బీ - విభాగంగా నిర్ణయించి పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించింది . పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతి గ్రూపు నుంచి రెండు ఉత్తమమైన పెయింటిం ట్లను ఈ నెల 25వ తేదీ లోగా వెబ్ సైట్ లో పొందుపరచడం లేదా నోడల్ అధికారికి అందిం చాల్సి ఉంది . పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యా ర్థులకు ఈ నెల 14వ తేదీ రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు . రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన పెయింటింగ్లు వేసిన విద్యార్థులను డిసెంబర్ 14వ తేదీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు . రాష్ట్రస్థాయిలో , జాతీయస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందించనున్నారు . అదేవిధంగా ఈ రెండు కేటగిరిల కింద పదిమంది చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందించనున్నారు . రాష్ట్రస్థాయిలో గ్రూప్ - ఏ , బీ విభాగాల్లో విడివిడి గా ప్రథమస్థానంలో నిలిచిన పెయింటింగ్ కు రూ . 50వేలు , ద్వితీయ స్థానంలో నిలిచిన పెయింటింగ్ కు రూ . 30వేలు , తృతీయ స్థానంలో నిలిచిన పెయింటింగ్ కు రూ . 20వేల చొప్పున నగదు అందించనున్నారు .
కన్సొలేషన్ కింద పది పెయింటింగ్ కు రూ . 7500 చొప్పున నగదు అందించనున్నారు . రాష్ట్రస్థాయిలో గెలుపొందిన

విజేతలకు జాతీయస్థాయిలో పెయింటింగ్ పోటీ లు నిర్వహించనున్నారు . జాతీయ స్థాయిలో గ్రూప్ - ఏ , బీ కేటగిరిల్లో విడివిడిగా ప్రథమ స్థానంలో నిలిచిన పెయింటింగ్ కు లక్ష రూపా యల నగదుతోపాటు ల్యాప్ టాప్ , లక్ష రూపా - యల నగదు ఫిక్స్ డిపాజిట్ చేస్తారు . ద్వితీయ D స్థానంలో నిలిచిన పెయింటింగ్ కు రూ . 50వేల నగ దుతోపాటు ల్యాప్ టాప్ , రూ . 50 వేల నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు . తృతీయ స్థానంలో • నిలిచిన పెయింటింగ్ కు రూ . 30వేల రూపాయల నగదుతో పాటు ల్యాప్ టాప్ , రూ . 30వేల నగదు ఫిక్స్ చేస్తారు . కన్సొలేషన్ కింద పది పెయింటిం గ్లకు రూ . 15వేల చొప్పున నగదు బహుమతి ఇస్తారు .

 ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూడాలి : డీఈఓ '

కేంద్ర ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో జరగ నున్న పెయింటింగ్ పోటీలకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు బుధ వారం ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు . జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు , మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశా లల ప్రధానోపాధ్యాయులంతా పెయింటింగ్ పోటీల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Painting competitions for students."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0