Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Description of Employees Long Term Leaves


  • ఉద్యోగుల లాంగ్ టెర్మ్ సెలవులు ఇలా . . . .
  • ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో వినియోగించుకునే సెలవుల్లో ఎక్కువ కాలం సెలవు పొందేందుకు అవకాశమున్నవి
  •  అర్ధ జీతపు సెలవు ( హె హేలీ ) లు , కమ్యూటెడ్ సెలవులు  .
  •  ఈ సెలవులకు నిబంధనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం . . . 
Description of Employees Long Term Leaves

అర్ధ జీతపు సెలవు 

  • ఈ అర్ధ జీతపు సెలవు పర్మినెంట్ ఉద్యోగుfc లకు మాత్రమే వర్తింస్తుంది , టెంపరరీ ఉద్యోగులు , ప్రొబెషన్ కాలం పూర్తవని ఉద్యోగులకు వర్తించదు . 
  • సర్వీసులో ఉండగా ప్రతి సంవత్సరం సర్వీసుకు 20 రోజుల అర్ధ వేతన సెలవులు జమవుతాయి .
  •  ఈ సెలవుల నిల్వకు గానీ , వాడుకోవటానికి గానీ గరిష్ట సెలవుల పరిమితి లేదు .
  •  అర్థ జీతపు సెలవును వ్యక్తిగత అవసరాలకు గానీ , వైద్య ధ్రువీకరణపత్రం ఆధారంగా గానీ వాడుకోవచ్చు . . 
  • హెచ్ పీఎల్ కాలానికి వేతనం , డీఏ సగము చొప్పున , మిగిలిన అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు . 
  • ఉద్యోగ విరమణ సందర్భంలో నిల్వ ఉన్న ఆ అర్ధవేతన సెలవును సంపాదిత సెలవుతో కలిపి 300 రోజుల పరిమితితో నగదు చెల్లిస్తారు .

 కమ్యూటెడ్ సెలవు 

  •  అర్హతగల అర్ధ వేతన సెలవులో సగానికి మించకుండా వైద్య ధ్రువీకరణపత్రం ఆధా రంగా మాత్రమే కమ్యూటెడ్ సెలవు మంజూరు చేస్తారు . 
  •  నిల్వ ఉన్న అర్ధవేతన సెలవు ఖాతాలో వాడుకున్న కాలానికి రెట్టింపు ఖర్చు రాసి కమ్యూటెడ్ సెలవును మంజూరు చేస్తారు .
  • మొత్తం సర్వీసులో కమ్యూటెడ్ సెలవును 240 రోజుల వరకు అనుమతిస్తారు . 
  •  కమ్యూటెడ్ సెలవు కాలానికి జీత , భత్యాలు పూర్తిగా చెల్లిస్తారు . 
  • వైద్య ధ్రువీకరణ పత్రాలు ఫారం ఏ అండ్ బీ సమర్పించాలి
  • కమ్యూటెడ్ సెలవును ఇతర సెలవులతో కలిపి ఒకేసారి 180 రోజుల వరకు వాడు కోవచ్చు . 

తాత్కా లిక ఉద్యోగులకు అర్ధ వేతన సెలవు 

  • తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రతి పూర్తి సంవ త్సరానికి 20 రోజుల అర్ధ వేతన సెలవు జమచే స్తారు .
  •  రెండేళ్ల సర్వీసు అనంతరం వైద్య కార ణాలపై మాత్రమే ఈ సెలవును వినియోగించు కోవచ్చు . 
  • కమ్యూట్ కూడా చేసుకోవచ్చు . రూల్ 10 ప్రకారం నియామకమైన ఉద్యోగులకు వైద్య కారణాల పైగానీ , వ్యక్తిగత కారణాలపైగానీ అర్ధ వేతన సెలవు మంజూరు చేయకూడదు . 

లీవ్ నాట్ డ్యూ 

శాశ్వత ఉద్యోగికి ఏవిధమైన సెలవు నిల్వలేనప్పుడు భవిష్యత్ లో లభించే అర్ధవేతన సెలవు నుంచి ఖర్చు రాయబడే విధంగా అర్ధ జీతపు సెలవును వైద్య ధ్రువీకరణ పత్రం ఆధారంగా మాత్రమే మంజూరు చేస్తారు . లీవ్ నాట్ డ్యూను కమ్యూటెడ్ లీవ్ గా వాడే అవకాశం లేదు .

ప్రత్యేక అర్ధవేతన సెలవు

  •  లెప్రసీ , టీబీ , క్యాన్సర్ , మానసిక అనారోగ్యం , గుండె జబ్బులు , మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాధులతో దీర్ఘకాల చికిత్స పొందు తున్న వారు
  •  సంబంధిత వైద్య నిపుణుని ధ్రువీక రణపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో ఈ ఖాతలో నిల్వ ఉన్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు .

 ముఖ్య విషయాలు . .

  •  సెలవులో వెళ్లడానికి ముందురోజు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లిస్తారు . . 
  • సెలవు మధ్యలో వేతనం పెంచినా సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేదీ నుంచి పెంచిన వేతనం వర్తిస్తుంది . 
  • 6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు హెల్మ్ప్ట్ , సీసీఏ చెల్లింస్తారు . 
  •  కుష్టు , గుండెజబ్బు , క్యాన్సర్ , ఎయిడ్స్ , మానసిక అనారోగ్యం , మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సంద ర్భంలో సెలవు తీసుకుంటే 8 నెలల వరకు హెమోగ్లై చెల్లిస్తారు . 
  • ఒకసారి మంజూరు చేసిన సెలవులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Description of Employees Long Term Leaves "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0