Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reliance Jio pays 6 paise per minute

Reliance Jio పెద్ద బాంబు పేల్చింది.. ఇక నిముషానికి 6 పైసలు చెల్లించాలి!

Reliance Jio ఏకఛత్రాధిపత్యానికి తెరతీసిందా?  ఇంటర్ కనెక్షన్ చార్జీలపై పేరు చెప్పి Airtel, Vodafone  వంటి ఇతర నెట్వర్క్ల సిమ్ కార్డులు వాడుతున్న వినియోగదారులని తన వైపు లాక్కోవడానికి ఎత్తుగడ వేసిందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
Reliance Jio pays 6 paise per minute

ఇక మీదట Airtel, Vodafone వంటి  ఇక్కడ నెట్వర్క్లకు Reliance Jio  నెంబర్ ద్వారా కాల్ చేయాలంటే తప్పనిసరిగా నిమిషానికి ఆరు పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీలు రద్దు చేసేంతవరకు ఇలాగ ఛార్జ్ చేస్తామని  ఆ సంస్థ ప్రకటించడం గమనార్హం. పరోక్షంగా TRAI మీద Jio వత్తిడి పెంచుతున్నట్లు దీన్నిబట్టి అర్థం అవుతోంది.

గత మూడేళ్ల కాలంలో ఇంటర్ కనెక్షన్ చార్జీల క్రింద ఇతర టెలికం సంస్థలకు 13 వేల 500 కోట్ల రూపాయలు తాము చెల్లించినట్లు ఆ సంస్థ చెబుతోంది. అయితే ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీలు చెల్లించాలి అన్న విషయం మరి మొదట్లో Jioకి తెలీదా? తెలుసు! మరి ఇప్పటి వరకూ ఫ్రీ కాల్స్ ఎందుకు ఇచ్చారంటే.. మిగతా ఆపరేటర్లని దెబ్బతీసి తమ subscriber బేస్ పెంచుకోవడానికి!  ఇక మీదట బయట నెట్వర్క్లకు చేసే కాల్స్ నిమిషానికి ఆరు పైసలు ఛార్జి చేయడంతోపాటు, వినియోగదారులకు అలా వసూలు చేసిన డబ్బులు ఒక సరిపడా మొబైల్ డేటా ఉచితంగా అందిస్తామని కంటితుడుపుగా హామీ ఇచ్చింది.
కచ్చితంగా ఇది ఏకస్వామ్యమే..  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పేరుచెప్పి..  ఇప్పటివరకు టెలికం రంగంలో ఉన్న సంప్రదాయాన్ని కాలరాసి మిగతా నెట్వర్కులను  ఉన్నఫళంగా సమాధి చేసే ప్రయత్నం. నిమిషానికి 6 పైసలు చెల్లించటం ఇష్టంలేక ఇప్పటివరకు Airtel, Vodafone, Idea వంటి  ఇతర సిమ్ కార్డులు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా Reliance Jioకి మారిపోతారు. తమ కుటుంబం మొత్తం, స్నేహితులు మొత్తం Jioలో ఉంటే ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు అన్న ఆలోచన అందరికీ కలుగుతుంది. దాంతో ఆయా నెట్ వర్క్‌ల subscribers తగ్గిపోతారు.

కచ్చితంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే టెలికం వినియోగదారుల ప్రయోజనాలు కాలరాయబడతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reliance Jio pays 6 paise per minute"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0