Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You come to our school.Also we Come to your school.

  • మీరు మా బడికి రండి . . మేమూ మీ బడికొస్తాం .
  •  విద్యాశాఖలో సరికొత్త కార్యక్రమం .
  • ఒక పాఠశాల విద్యార్థులు మరో పాఠశాల సందర్శన వారం రోజులు వేరే స్కూల్లో చదువులు.
  • జిల్లాలో 876 పాఠశాలల ఎంపిక ఒక్కో పాఠశాలకు , రూ . 1000 మంజూరు. 
  • కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖాధికారులు      
  • సంప్రదాయాలకు ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది .
You come to our school.Also we Come to your school.

 సమస్యకు మూలాలను వెతికి , అక్కడనే మార్పుకు బీజాలను వేస్తోంది . విలువలతో కూడిన విద్యను అందరికీ అందించినప్పుడే సమా జాభివృద్ధి సాధ్యమని మహాత్ముడు కన్న కల లను సాకారం చేసేలా సరికొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది . విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రక టిస్తే , అది సాధ్యమేనా అని సంశయం వ్యక్తం చేసిన విద్యారంగ నిపుణులు సైతం తాజా నిర్ణ యాలకు ఫిదా అవుతున్నారు . విద్యాశాఖ చరిత్రలో తొలిసారిగా ' పాఠశాలల కలయిక ' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు .
ప్రభుత్వ ఆదేశాలతో సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఓడ్రేవు చిన వీరభద్రుడు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు . ప్రభుత్వ , ప్రైవేటు , ఎయిడెడ్ పాఠశా లను అనుసంధానం చేస్తూ నగర , పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పరస్పరం కలుసుకొని చర్చించుకోవటం ద్వారా విద్యార్థి దశలోనే మేధోమథనం జరిగేలా కార్యక్రమం రూపకల్పన చేశారు . ఇతర పాఠశాలల్లో ఏం జరుగుతుందనే పరిశీలన చేయటం ద్వారా విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన , మేధోమ ధనం , భావ వ్యక్తీకరణ పాంపొందించటం దీని ప్రధాన లక్ష్యం . 

అనుబంధాల కలయిక 

గ్రామీణ ప్రాంతంలోని ఒక పాఠశాల విద్యార్థు | లంతా సమీప పట్టణం లేదా కొంతమేర అలి వృద్ధి చెందిన పాఠశాలను సందర్శిస్తారు . ఇదే రీతిన పట్టణ ప్రాంత పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలను సంద ర్శిస్తారు . 6 నుంచి 18 సంవత్సరాల వయస్సుఉండి 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యు లను చేయాలి . వారం రోజులపాటు అదే పాఠ శాల విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసి , ఆటపాటలతో చదువులు సాగిస్తారు . ఇందుకోసమని జిల్లాలో 876 ( 438 జతలు పాఠశాలలను ఎంపిక చేశారు . దీనిని ఈ నెల మూడో వారంలో అమలు చేసేందుకు విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు . రవాణా ఖర్చులు , ఇతర అవసరాల కోసమని ఒక్కో పాఠశాలకు రూ . 1000లు చొప్పున ప్రత్యేకంగా నిధులు విడు దల చేశారు . అవసరమైన పక్షంలో పాఠశాల లో అందుబాటులో ఉన్న నిధులు సైతం దీని కోసమని వినియోగించుకోవచ్చు . . .

 ఆతిథ్యమివ్వనున్న పేరెంట్స్ కమిటీలు 


మన ఇంటికి చుట్టాలు లేదా స్నేహితులు వస్తే అనుబంధం బలపడేలా ఏ రీతిన మర్యాదలు చేస్తామో అదే రీతిన పాఠశాల లకు వచ్చే విద్యార్థులకు తగిన సౌకర్యాలు
కల్పించేలా పేరెంట్స్ కమిటీ బాధ్యత తీసు కోవాలని ప్రభుత్వం సూచించింది . వసతి , తాగునీరు , భోజనం , అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి , కార్య క్రమం సానుకూలంగా నిర్వహించేలా చూడాలి . ఆతిధ్యమిచ్చే పాఠశాల , విద్యార్థు లు , ఉపాధ్యాయులు సాధించిన విజయాలు , అందుకు చేసిన కృషిని , వారి మార్గ నిర్దేశా లను వివరించటం ద్వారా విద్యార్థుల అభ్యు న్నతికి దోహదపడే కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి .

జిల్లా స్థాయిలో పర్యవేక్షణ


 విద్యార్థి దశలోనే స్నేహ బంధం , అను బంధాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ , సత్ప్రవర్తనతో చదువులు సాగించేలా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా దీనిని అమలు చేస్తోంది . దీనిని విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులు ఎప్పటిక ప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . మండల , జిల్లా , రాష్ట్ర స్థాయి కమిటీలు ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You come to our school.Also we Come to your school."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0