Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

E-library

అరచేతిలో ఈ- గ్రంథాలయం
అరచేతిలో ఈ 70 భాషల్లో 68 లక్షల పుస్తకాలు 
E-library

 'చిరిగిన చొక్కా అయినా వేసుకో . . కానీ మంచి ఈ పుస్తకం కొనుక్కో ' అన్నారు మహాకవి . . పుస్త కాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందిం చుకోవచ్చు . . పోటీ పరీక్షల్లో విజయం సాధిం చాలన్నా వివిధ పుస్తకాలు చదవడం తప్పని సరి . ఈ నేపథ్యంలో మార్కెట్ లో పుస్తకాలకు గిరాకీ పెరిగింది . వాటిని చదవాలనే తపన ఉన్నా . . ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన లేని వారి సంఖ్య అధికంగానే ఉంది . అటు వంటి వారంతా గ్రంథాలయాలకు వెళ్లి చదువుకొందామంటే అవసరమైన పుస్త కాలు దొరకని పరిస్థితి నెలకొంది . అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా లక్షలాది పుస్తకాలను ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం వస్తే . . అది పుస్తక ప్రియులకు శుభవార్తె . . . అవును ఇదంతా ఈ - గ్రంథాలయం ద్వారా సాధ్యమవుతుంది . 

అందుబాటులో . . 


  • ఈ - గ్రంథాలయంలో ఒకటి కాదు . . రెండు కాదు ఏకంగా 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి . 
  • చిన్నారులు , యువత , పెద్దలు , వృద్ధులు అందరికీ అవసర మైన పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉంటున్నాయి .
  •  ఇంట్లో కంప్యూటర్ , లేకపోతే చేతిలో మొబైల్ ఫోన్ . . వాటికి అంతర్జాల సదుపాయం ఉంటే చాలు .
  •  మీకు ఇష్టమైన , అవసరమైన పుస్తకాలను ఇంట్లో కూర్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు . 
  • చరవా ణిలో ' నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ' యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ లక్షల పుస్తకాలు అరచేతిలో ఉన్నట్టే .

ఎందరో రచయితలు 

కేంద్ర మానవ వనరుల శాఖ ఖరగ్ పూర్ ఐఐటీ సహకారంతో డిజిటల్ లైబరీ ఆఫ్ ఇండియా ' పేరుతో వెబ్ సైట్ రూపొందించింది . ఇందులో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు అన్ని రకాల పుస్తకాలు అందు బాటులో ఉన్నాయి . ఆంగ్లం , హిందీలో పాటు 70 భాషల్లో 68 లక్షల పుస్త కాలు అందుబాటులో ఉంటాయి . సుమారు మూడు లక్షల మంది రచిం చిన ఏడు లక్షల పుస్తకాలు , రెండు లక్షల మంది రచయితల మూడు లక్షల కధనాలు , 262 ఆడియో కథ నాలు , 18 , 000కు పైగా వీడియో కథ నాలు అందుబాటులో ఉంటాయి . వ్యవ సాయం , కంప్యూటర్ సైన్స్ , ఐటీ , జన రల్ ఫిలాసఫీ , సైకాలజీ అంశాలకు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఎందరో మహానుభావులు రాసిన లక్షల పుస్తకాలు ఈ గ్రంథాల యంలో అందుబాటులో ఉన్నాయి . 

ఎలా చదవాలంటే . . 


  • అంతర్జాలంలో గూగుల్ లోకి వెళ్లి ఎ డీఎల్ . ఐఐటీ కేజీపీ . ఏసీ . ఇన్ ( నేషనల్ డిజిటల్ లైబరీ ఆఫ్ ఇండియా ) లో లాగిన్ అవ్వాలి .
  •  తెరపై వచ్చిన ఆంశాలను క్షుణ్నంగా చూసు కుని వ్యక్తి గతంగా , సంస్థల పరంగా నమోదు చేసుకోవాలి . .
  •  ఇందులో ఈ - మెయిల్ , చిరునామా , పాస్వర్డ్ నమోదు చేసుకో వాలి . 
  • ఒకసారి నమోదు చేసుకున్నాక ఎప్పుడైనా లాగిన్ అయి కావాల్సిన పుస్తకాలను చదువుకోవచ్చు . 
  • ఆండ్రాయిడ్ చరవాణులు కలిగిన ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ ద్వారా పుస్త కాలు చదువుకోవచ్చు .
  •  అవసరమైన పుస్తకాలను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "E-library"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0