Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Money can be withdrawn free of charge even after the SBI has crossed the ATM limit


స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉందా? అయినుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారా? అయితే మీకు ఒక అలర్ట. నెలవారీ లిమిట్ దాటినా కూడా ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Money can be withdrawn free of charge even after the SBI has crossed the ATM limit

ప్రధానాంశాలు:

ఎస్‌బీఐ ఏటీఎం పరిమితి దాటిన తర్వాత కూడా చార్జీలు లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు
దీని కోసం ఒక ఆప్షన్ అందుబాటులో
అదే యోనో కార్డ్‌లెస్ విత్‌డ్రాయెల్స్
డెబిట్ కార్డు లేకుండానే డబ్బు డ్రా చేసుకోవచ్చు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఇందులో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా ఒకరకం. బ్యాంక్ కస్టమర్లు ప్రత నెలా పరిమిత సంఖ్యలో లావాదేవీలు నిర్వహించొచ్చు. కొన్నిసార్లు మాత్రమే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పరిమితి దాటితే చార్జీలు పడతాయి.
అయితే ఏటీఎం పరిమితి దాటిన తర్వాత కూడా చార్జీలు పడకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఒకటుంది. అదే యోనో కార్డ్‌లెస్ విత్‌డ్రాయెల్స్. బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్ సాయంతో డెబిట్ కార్డు లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లావాదేవీల పరిమితికి ఇవి అదనం.

యోనో యాప్‌తో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఇలా..

గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏటీఎం కార్డు లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చు.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 6 నెంబర్ల ఎంపిన్‌ను సెట్ చేసుకోండి. దీని సాయంతో యాప్‌‌లోకి లాగిన్ అవ్వొచ్చు. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో కూడా లాగిన్ కావొచ్చు. ఎంపిన్ వాడటం సులభం.

ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత యోనో క్యాష్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోండి. రిక్వెస్ట్ టు యోనో క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. పిన్ ఆరు అంకెలు, యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్‌లో కూడా ఆరు అంకెలు ఉంటాయి

 ఈ నెంబర్లు మీ వద్ద ఉన్న తర్వాత దగ్గరిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. యాప్‌లోనే దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్ తెలుసుకోవచ్చు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డెబిట్ కార్డు లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

 ఏటీఎం స్క్రీన్‌పై యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత యోనో క్యాస్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అటుపైన అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత యోనో క్యాష్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Money can be withdrawn free of charge even after the SBI has crossed the ATM limit"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0