Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health cards online for government employees


  •  ఆన్ లైన్ లో ఆరోగ్య కార్డులు..
  • గుర్తింపు లేనివారికి సువర్ణావకాశం..
  • నేరుగా దరఖాస్తుకు వీలు..
  • దరఖాస్తుకు అవసరమయ్యే వివరాలు ఇవే
Health cards online for government employees

  • రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గుర్తింపు కార్డును ఇకపై ఆన్లైన్లో పొందవచ్చు . 
  • ఉద్యోగి , వారిపై ఆధారపడే వారి వివరాలు ఇందులో నమోదై ఉంటాయి .
  •  వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలైనా ఆసుపత్రికి వైద్యం కోసం వెళితే ఈ కార్డును చూపించాల్సి ఉంటుంది . 
  • గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ హెచ్ సీకి సంబంధిం చి ముగ్గురు ఉద్యోగులతో ఒక విభాగం ఉంది .
  •  ఉద్యోగి ఈ విభాగంలో సంప్రదిస్తే వారు కార్డును ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయానికి పంపించి ఆమోదం పొందుతారు .
  •  ఆ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకుంటారు . 
  • వాస్తవానికి ఎనిమిదేళ్ల కిందట ఈ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టినా ఆరేళ్లుగా చాలా మందికి కార్డులు లేవు . 
  • ఉన్న వాట్లో మార్పులు చేర్పులు చేయా ల్సి ఉన్నా జరగడం లేదు .
  •  ఈ సమస్యను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఆన్లైన్లో పొందడానికి అవకాశం ఇచ్చింది . 
  • దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ఉద్యోగులకు తీరనుంది .

జత చేయాల్సినవి ఇవీ . . . 


  • ఎస్ఆర్ , ఫొటోలు , 
  • పుట్టిన తేదీకి సంబందించి టెన్త్ ధ్రువీకరణ పత్రం . 
  • ఉద్యోగిపై ఆధారపడిన వారి వివరాలు 
  • ఉద్యోగి తో ఉన్న సంబంధం పేర్కోవాలి . 
  • అందరి ఆధార్ కార్డుల నెంబర్లు ఇవ్వాలి . 
  • ఐదేళ్లలోపు పిల్లలుంటే వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతచేయాలి . 
  • వికలాంగులు ఉంటే వారి వివరాలు 
  • వైద్యులు ధ్రువీకరణ పత్రం . .
  •  జత చేసిన అన్ని పత్రాలు స్కానింగ్ చేసి పంపాలి . 

ఆన్లైన్లో దరఖాస్తులకు అవసరమయ్యే వివరాలు ఇవీ . . .


  • కార్డు కోసం గుర్తింపు నెంబరు అంటే ట్రెజరీ అధికారులు కేటాయించిన గుర్తుంపు నెంబరు పొందుపర్చాలి . . 
  • పింఛను పొందుతున్న వారైతే పీవోసీ పేరుతో ట్రెజరీ అధికారులు కేటాయించిన నెంబరు తీసుకోవాలి . 
  • ఆ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ లో రాసిన పేరు ఆధార్ నెంబరు , ఎస్ఆర్ ప్రారంభ సమయంలో ఇచ్చిన గుర్తింపు ఐడీ ఉంచుకోవాలి . 
  • ఎస్ఆర్లో రాసిన వివరాల ఆధారంగా పుట్టిన తేదీ , వైవాహిక స్థితి , కులం , జాతీయత , నివాసం , ఇంటి చిరునామ , ఈ - మెయిల్ ఐడీ , మొబైల్ నెంబరు ఇవ్వాలి . 
  • కుటుంబ సభ్యుల్లో వికలాంగులు ఉంటే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి . 
  • రేషన్ కార్డ్ నెంబరు , టెన్ సర్టిఫికెట్ లో పేర్కొన్న రెండు పుట్టుమచ్చల వివరాలు తెలపాలి . . 
  • ఏ శాఖలో పనిచేస్తున్నారు , ఉద్యోగం వివరాలు , పేస్కేల్ , ప్రస్తుతం పొందుతు న్న వేతనం వివరాలు నమోదు చేయాలి . 

నమోదు ఇలా . . . 


  • ముందుగా ఈ హెచ్ఎస్ . ఎస్ కైవోవీ . ఇన్ అనే వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి . 
  • ఆ ఉద్యోగి కోడ్ , యూజర్ ఐటీ , వేతన చెల్లింపు అధికారి కేటాయించిన పాస్వర్డ్ ఉపయోగించాలి . . 
  • ఉద్యోగి పేరు నమోదు చేశాక ఆధార్ కార్డు నెంబరు నమోదు చేయాలి . .
  •  క్లిక్ హియర్ ఫర్ రిఫరెన్స్ ఆప్షన్ వచ్చాక అందులోనూ ఆ ధార్ నెంబర్లు నమోదు చేయాలి . .
  •  దరకాస్తులో అన్ని వివరాలు నమోదు చేశాక తప్పులే మైనా ఉంటే వాటిని సరిచేసి మళ్లీ నమోదు చే యాలి . 
  • ప్రింట్ కాపీపై సంతకం చేశాక ఆన్లై లో ఆప్లోడ్ చేయాలి .
  •  ఆ వివరాలు నింపి సంతకం చేసిన దరఖాస్తు ప్రింటు వేతన చెల్లింపు అధికారికి అందజేయాలి . 
  • ఉద్యోగి , కుటుంబ సభ్యుల ఫొటోలు , ఎస్ఆర్ మొదటి రెండు పేజీలు స్కాన్ చేసి దరఖాస్తుతో పాటు ఇవ్వాలి . 
  •  బయోమెట్రిక్ విధానంలో జీతాలు చెల్లించే అధికారికి దరఖాస్తు ఇచ్చిన ప్పుడు కుటుంబ సభ్యుల వేలిముద్రలు ఇవ్వాలి . 
  • జీతం చెల్లించే అధికారికి అన్ని వివరాలు ఆధారాలతో అందించాక ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు అందినట్లు రశీదు తీసుకోవాలి . 
  • అన్ని వివరాలు ఆన్ లైన్లో పొందుపర్చాక 15 రోజుల్లో కార్డు సిద్ధంగా ఉందన్న సమాచారం ఈ మెయిలకు లేదా ఫోన్ నెంబర్ కు వస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health cards online for government employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0