Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If government employees are injured on duty. . Special holidays include 180 days of full pay holidays

విధి నిర్వహణలో గాయపడితే . . 
ప్రత్యేక సెలవులు 180 రోజులు పూర్తి వేతనంతో కూడిన సెలవులు.
If government employees are injured on duty. . Special holidays include 180 days of full pay holidays

ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వ హణలో కొన్ని సంద ర్భాల్లో బస్సులు , రైళ్లు , విమానాల్లో ప్ర యాణం చేయాల్సి రావచ్చు . ఆ సందర్భం గా ప్రమాదాలు జరిగి ఆరోగ్యానికి ఇబ్బంది అయితే ప్రత్యేక నిబంధన లు ఉద్యోగుల హక్కులను పరి రక్షిస్తుందని ఏపీ ఎన్జీవో రాయదుర్గం శాఖ అసోసియేట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు తెలిపారు . ప్రభుత్వ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో లేక తన కార్యాలయంలో ప్రమా దవశాత్తు అస్వస్థతకు గురైతే అంగ వైకల్యం పాలైతే వారికి ప్రాథమిక హక్కుల ద్వారా జీతంతో కూడిన సెలవులు లభిస్తాయి . ఉద్యోగికు ఉన్న మెడికల్ లీవులకు ఇది అదనంగా లబ్ధి చే కూ ర్చుతుంది .

 నిబంధనలు .


  • ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఎక్కడికైనా వెళ్లి ప్రమా దంలో చిక్కుకుని దీర్ఘకాలం మంచానప డితే మూడు నెలలు లోగా ఈ సెలవు విని యోగించు కునేందుకు దర ఖాస్తు చేసుకో వచ్చు . 
  • అయితే ప్రమాదం బారిన పడిన వి షయాన్ని సంబంధిత శాఖాధిపతికి ముందే తెలియజేయాలి . 
  •  ఆశక్తత సెలవు మంజూరయ్యే దాకా మెడికల్ లీవును విని యోగించుకోవాలి . మంజూరైన తరువాత ఈ సెలవు విని యోగం లోకి వస్తుంది . 
  • గాయపడిన వారిలో గెజిటెడ్ ఉద్యో గులు మెడికల్ బోర్డు నుంచి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు , సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి . 
  • ప్రమాదం జరిగిన తరువాత ముం దుగా రెండు నెలలు ఈ సెలవు మంజూరు చేస్తారు .
  •  ఆ తరువాత కూడా ఉద్యోగి విధులు నిర్వహించలేని పరిస్థితులలో ఉంటే మళ్లీ ప్రభుత్వ వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి . 
  • అప్పుడు పూర్తి స్థాయి సెలవు మంజూరు అవు తుంది .- ఈ సెలవు మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి తప్ప కింది స్థాయి అధికారు లకు లేదు . 
  • ఉద్యోగి దరఖాస్తు చేసిన తరు వాత సంబంధిత అధికారులు అన్ని వివ రాలు పొందుపరిచి ప్రభుత్వం నుంచి అను మతి పొందాలి . 
  • ఈ ప్రత్యేక సెలవులలో 180 రోజుల వరకు పూర్తి జీతం , 180 రోజుల తరువాత అర్ధ జీతం చెల్లిస్తారు . 
  • ప్రత్యేక సెలవు రెండు సంవత్సరాలకు మించకూడదు .
  •  ఆ తరువాత కూడా చాలా అవసరం అయితే తనకున్న ఇతర సెల వులు వినియోగించుకోవాలి .

 ఎలాంటి సందర్భాలలో వర్తించవు .


  • విధి నిర్వహణ ముగిశాక పని చేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి వెళు తున్న సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగిన ఈ సెలవు మంజూరు చేయరు . -
  •  పనిచేస్తున్న కార్యాలయ శాఖాధిపతి ధ్రువపత్రం లేకపోతే వర్తించదు . 
  •  ఉద్యోగి క్యాజువల్ లీవులో ఉన్నప్పుడు ప్రమాదం బారిన పడినా ప్రత్యేక సెలవు మంజూరు చేయరు .
  •  విధులకు హాజరైన , పై అధికారి అను మతితో వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లి నప్పుడు ప్రమాదం జరిగినా ప్రమాద సెలవు మంజూరు చేయరు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If government employees are injured on duty. . Special holidays include 180 days of full pay holidays"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0