Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More
Students in grades one to eight class of all state-owned schools are preparing to deposit uniform stitching charges cash in their mothers' account.
  •  ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతి చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ కుట్టుకూలీ నగదు వారి తల్లుల ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం..
  •  విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరణ..

Students in grades one to eight class of all state-owned schools are preparing to deposit uniform stitching charges cash in their mothers' account.

 ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టు కూలీ నగదు వారి తల్లుల ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధమైంది . గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక జత దుస్తులు పెండింగ్ లో ఉన్నాయి . తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో రెండు జతలు ఇవ్వనున్నారు . అంటే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మూడు జత యూనిఫాం అందాల్సి ఉంది . ఇప్పటికే కుట్టిన ఒక జత యూనిఫాం విద్యార్దు లకు అందించారు . మిగిలిన రెండు జతల యూనిఫాం ను కుట్టి ఇవ్వకుండా క్లాత్ రూపంలో ఇవ్వాలని సమగ్ర శిక్షా అభియాన్ నిర్ణయించింది . సంబంధిత విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కుట్లు కూలీ నగదు జమ చేసేందుకు మండలాల వారీగా వారి బ్యాంకు ఖాతా వివరాలను మండల విద్యాశాఖాధికారులు సేకరించే పనిలో నిమయ్యారు .

 సైజుకు తగిన యూనిఫాం . . .

  ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు . వీరందరికి గతంలో యూనిఫాం కుట్టించి ఇచ్చేవారు . విద్యార్థుల సైజుకు సరిపడే విధంగా యూనిఫాం ఉండేది కాదు . కొంతమంది విద్యార్థులు చాలీ చాలనీ యూనిఫాం , మరికొందరు వారి వయస్సు , సైజు కంటే పెద్దగా ఉండి లూజుగా ఉండే యూనిఫాం వేసుకునేవారు . విద్యార్థుల వాస్తవ సైజులకు అనుగుణంగా యూనిఫాం ఉంటే బాగుంటుందని తల్లిదండ్రుల నుంచి విన్నపాలు రావ డంతో , ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది . నేరుగా యూనిఫాం క్లాలు అందించి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిపడే విధంగా దగ్గరుండి కుట్టించుకునేందుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కుట్టు కూలీ చార్జీల నగ దును జమ చేయాలని నిర్ణయించింది . ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అన్ని జిల్లాల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . 

 అమ్మ ఒడికి ఉపయోగం . .

 జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠ శాలల విద్యార్థుల సేకరిస్తున్న వివరాలు అమ్మ ఒడి పథకానికి కూడా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తు న్నాయి . జనవరి 26వ తేదీ నాటికి అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు 15 వేల రూపా యల నగదు జమ చేసేందుకు వివరాలు ఉపయోగప డనున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0