Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Y.S.R KANTIVELUGU


  • 10న వైఎస్సార్ కంటి వెలుగు 
  • రూ . 500 కోట్లతో పథకం అమలు .
  • తొలిరోజే 70 లక్షల మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు .
  • 6 దశల్లో శస్త్ర చికిత్సలు .
  • ఉచితంగా ఆపరేషన్లు , మందులు , కళ్ళజోళ్లు

Y.S.R KANTIVELUGU


రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా అనేక కీలక కార్యక్ర మాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది . అతి ముఖ్య శాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్య మంత్రి జగన్ నడుం బిగించారు . వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణ లపై సుజాతారావు కమిటీని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది . ఇప్పటికే ఆ కమిటీ పలు సిఫార్సులు , మార్పులకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందజేసింది . ఈ దశలోనే ఆయన తెలంగాణలో సక్సెస్ అయిన కంటివెలుగు పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు . ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు 

వైఎస్సార్ కంటి వెలుగు పేరిట ప్రారంభించనున్న ఈ పథకానికి రూ . 500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది . రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉచితంగాకంటివైద్యపరీక్షలు నిర్వహించడమేకాకుండా ఆధునిక వైద్య సేవలు అందించనున్నారు . ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ) ఆళ్ల నాని ఇప్పటికే నేత్ర వైద్య ని పుణులతో భేటీ అయి వారి సాకారాన్ని కోరారు . నేత్ర వైద్యులు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న నిర్దిషహామీని ఇచ్చారు . | అక్టోబరు 10న 70 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు . దీనికి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రారంభిం చింది . అక్టోబరు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కంటివైద్య పరీక్షలు నిర్వహించిఆతరువాత ఆరుదశల్లోకంటిచూపు లోపంతో పాటు ఇతర శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఆధునిక వైద్యాన్ని అందించనున్నారు . ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడంతో పాటు మందులు , కళ్ళజోళ్లు ప్రభుత్వం అందిస్తుంది . ఇప్పటికే దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది . తెలంగాణలో ఎంతో విజయవంతమైన ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంతో పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది . తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు . ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు . దీంతో అధికార యంత్రాంగం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Y.S.R KANTIVELUGU"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0