Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The impact of the cell phone on our health

ఆరోగ్యంపై ' మొబైల్ ' పిడుగు.
" సెల్ ఫోన్లతో నరాల జబ్బులు

 " నీలికాంతితో మెదడుపై ఒత్తిడి 

ఒత్తిడి , ఆందోళన , నిద్ర లేమి . . . ఇవన్నీ మానసిక సమస్యలు మూర్చలు , తలనొప్పి , పార్వపునొప్పి , మెడ నొప్పి , వినికిడి లోపం , చూపు దెబ్బతినడం . . . ఇవన్నీ శారీరక సమస్యలు మామూలుగా అయితే ఇవి రావడానికి వేర్వేరు కారణాలుంటాయి . కానీ , ఇటీవలికా లంలో ఒకే ఒక్కటి ఇన్ని సమస్యలకు కారణ మవుతోంది . అదే . . సెల్‌ఫోన్ ! మనిషి వీలు కోసం అభివృద్ధి చేసిన అద్భుత ఆవిష్కరణ అది . కానీ . . మొబైల్ ఫోన్ అతివాడకం అనేకరకే కాలుగా చేటు చేస్తోంది . స్మార్ట్ఫోనన్ను అవసన రానికి మించి వాడటం వల్ల అది  తీవ్రంగా ఒత్తిడి పెంచుతోందని వైద్యనిపు ణులు హెచ్చరిస్తున్నారు . సెల్‌ఫోన్ తెర నుంచి వచ్చే నీలం రంగు కిరణాలు మెద డును విశ్రాంతికి దూరం చేస్తున్నాయని , దీని వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతోందని వారు పేర్కొంటున్నారు . రోజులో ఎక్కువ గంటలు మొబైల్ తో గడిపే వారి ఆరోగ్యం పలువిధా లుగా దెబ్బతింటుందని . . ఇటీవలికాలంలో న్యూరాలజీ విభాగంలో వైద్యుల వద్దకు వచ్చే ఆవుట్ పేషంట్లలో చాలామంది మొబైల్ బాధి తులే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
The impact of the cell phone on our health

 రోజుకు 20 నుంచి 30 . . . . 

ఓ పదేళ్ల క్రితం ఆస్పత్రుల్లో న్యూరలాజికల్ విభాగాల్లో పెద్దగా రద్దీ కనిపించేది కాదు . రోజుకు ఒకటో రెండో కేసులు వచ్చేవంతే . కానీ ఇప్పుడు రోజుకు 50 నుంచి 60కి పైగా కేసులు వస్తున్నాయి . వాటిలో 20 - 30 కేసు లకు మూల కారణం మొబైల్ ఫోన్లేనని  వైద్యుల పరిశీలనలో తేలుతోంది . మరీ  ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా కనిపిం చడం గమనార్హం . ఒక వైద్యుడి వద్ద 20 - 30  కేసుల చొప్పున లెక్కేస్తే గ్రేటర్ పరిధిలోని  న్యూరాలజిస్టులందరివద్దా కలిపి రోజుకు 2 - 3 వేల కేసులు మొబైల్ ఫోన్లలో ముడిపడినవే ఉంటున్నాయని అంచనా . రక్తపోటు , మదు మేహ బాధితుల ఆరోగ్యంపై ' మితిమీరిన మొబైల్ వాడకం ' మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు .  నిద్ర లేకపోవడం వల్ల వల్ల గుండె దడ పెరు గుతుందని ఆరచేతిలో ఫోన్ పెట్టుకొని మెడ వంచి , ఆదేపనిగా సెల్ఫోన్ వైపు చూస్తే స్పాండిలైటిస్ కూడా వస్తుంది.  తమ వద్దకు వచ్చే నాడీ సంబంధిత అనారోగ్య కేసులో ఎక్కువ మంది 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు . అందులోనూ 30 నుంచి 40 శాతం మహిళలే ఉంటున్నారట . కొద్దిగా కష్టమే అయినా , మొబైల్ ఫోన్లను అతిగా వాడటం మానేస్తే కొద్దిరోజుల్లోనే సమ స్వలన్నీ సర్దుకుంటాయని సూచిస్తున్నారు , 

ఏం చేయాలంటే . .

  •  ఫోన్ ఆతివాడకం వల్ల కలిగే సమస్యలను అధిగమించాలంటే . . 
  •  రాత్రి పూట సెల్ఫోన్ చూడొద్దు
  • నోటిఫికేషన్ రింగ్ టోన్స్ ని " డిజేబుల్ చేయాలి . 
  • లేకపోతే ఎసెమ్మెస్ , వాట్సాప్ మెసేజ్ , ఇతరత్రా నోటిఫికేషన్లు వచ్చిన ప్రతిసారీ ఫోన్ వైపు చూడాలనిపిస్తుంది . 
  • గుడ్ మార్నింగ్ , గుడ్ నైట్ మెసేజీలు పెట్టడం మానుకోవాలి . 
  • కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో మొబైల్ను పక్కన పెట్టాలి పడుకునే సమయంలో దగ్గరగా సెల్ ఫోన్ పెట్టుకోవద్దు . 
  • సెల్ల్ఫోన్  రోజుకు రెండు  గంటలకు మించకుండా జాగర్తపడాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The impact of the cell phone on our health"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0