Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The terms of increments that an employee takes during the service period are as follows.

ఇంక్రిమెంట్లకు సంబంధించిన విధివిధానాలు..
 ఒక ఉద్యోగి సర్వీసు కాలంలో తీసుకునే ఇంక్రిమెంట్ల నిబంధనలు ఇలా.
The terms of increments that an employee takes during the service period are as follows.

ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో అనేక ఇం క్రిమెంట్లు తీసుకుంటారు . ఆ ఇంక్రిమెంట్లకు సంబంధించిన విధి విధానాలు , పూర్తి నిబం ధనలను ఏపీ ఫైనాన్షియల్ కోడ్లో స్పష్టంగా నిర్వచించారు . ఒక ఉద్యోగి సర్వీసుకాలంలో తీసుకునే ఇంక్రిమెంట్ల నిబంధనల గురించి తెలుసు కుందాం .

వార్షిక ఇంక్రిమెంట్ 

ఒక సంవత్సర కాలం పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్ అంటారు . ఒక ఉద్యోగిపై ఆరో పణలు , ఛార్జ్ షీట్లు పెండింగ్లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు . నెల మధ్యలో వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే అదే నెల మొదటి తేదీకి మార్చు తారు . పనిష్మెంట్ కింద ఇంక్రిమెంట్లు నిలిపివే సిన కేసుల్లో పనిషమెంట్ సమాప్తమైన తేదీ నుంచి మంజూరు చేస్తారు . ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తి కాగానే మంజూరు చేస్తారు . నెలలో ఆఖరిరోజు సాయంత్రం కొత్తగా సర్వీసులో చేరిన వారు తరువాతి నెల మొదటి తేదీ నుంచి జీతానికి అర్హులు . జీతం తీసుకున్న నెల మొదటి రోజు ఇంక్రిమెంట్ తేదీ అవుతుంది . ఇంక్రిమెంట్ ను పరిగణించే సమయం
1 . వేతన స్కేలులో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం
 2 . అన్ని రకాల సెలవులు ( లాస్ ఆఫ్ పే తప్ప )
3 . డిప్యూటేషన్ పై పనిచేసిన కాలం . అనుమతించిన మేరకు జాయిన్ కాలం . లాస్ ఆఫ్ పే సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్ కు పరిగణిం చరు . సదరు సెలవులు వాడుకు న్నన్ని రోజులు ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది . అయితే వైద్య కారణాలతో , శాస్త్ర సాంకేతిక ఉన్నత విద్య కోసం ఇంకా ఉద్యోగి పరి ధిలో లేని కారణాలతో లాస్ ఆఫ్ పే వాడుకుంటే ఆరు నెలల వరకు అలాంటి సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్ పరిధిలోకి లెక్కించే అధికారం ప్రభుత్వ శాఖల అధికారులకు ఉంటుంది . ఆరు నెలల కంటే ఎక్కువ లాస్ ఆఫ్ పే సెలవులను వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవాలి .

 ఇంక్రిమెంట్ కు వీటిని పరిగణించరు 

తప్పుడు ప్రవర్తన , విధి నిర్వహణలో అలక్ష్యం ఉంటే క్రమశిక్షణ చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రి మెంట్ను నిలిపివేయవచ్చు . విత్ అవుట్ క్యుము లేటివ్ ఎఫెక్ట్ ప్రకారం కేవలం ఒక సంవత్సరం మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేదీకు విడుదల చేస్తారు . విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ప్రకారం ముందు విచారణ అధికారిని నియమించాలి . సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి . ఉద్యోగికి చార్జ్ షీట్ అందించడమే కాకుండా , ఏ సాక్ష్యాధా రాల ప్రకారం ఉద్యోగిపై ఆ ఆరోపణలు చేశారో దానిని కూడా అతనికి అందించాలి . ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంట్ కోల్పో తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The terms of increments that an employee takes during the service period are as follows."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0