Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration Teacher Mandala Satyannarayana


  •  చిత్రాలు గీస్తూ . . చరిత్ర చెబుతూ !
  • ఆ తరగతి గదికి వెళితే రంగురంగుల చిత్రాలు దర్శనమిస్తాయి . 
  • ఎటు చూసినా . . జాతీయ నాయకుల ఫొటోలు తళుక్కుమంటాయి . 
  • మరో మెట్టుపైకెక్కి , విద్యా బోధన కూడా బొమ్మల ద్వారానే బోధిస్తారు . 
  • ఇవి ఏ కెమెరాలతో , సెల్‌ఫోన్లో తీసినవి కాదు . 
  • ఓ ఉపాధ్యాయుడు తన హస్తాలతో గీచిన చిత్రాలు . 
  • ఆయనే . . గంట్యాడ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మండల సత్యనారాయణ .
  • బొమ్మలతో విద్యా బోధన 
  • విద్యార్థులను ఆకట్టుకుంటున్న వైనం " వినూత్న రీతిలో బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ
Inspiration Teacher Mandala Satyannarayana

 ఎందరో మహానుబావులు అందరికీ వంద నాలు అన్నాడో మహాకవి . దేశ నాయకులు త్యాగాలు ఫలితంగా నేడు మనం ఎంతో స్వేచ్ఛగా జీవించగలుతున్నామన్నది జగమెరిగిన సత్యం . అటువంటి మహానుబావుల జీవిత చరిత్రలను బోధిస్తున్నారు . ఆ ఉపాద్యాయుడు . విద్యార్థులకు తను గీచిన చిత్రాల ద్వారా బోధన చేస్తున్నారు . ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నాయకు లు ముందు చూపు కారణంగా మనం వారి ఫలాలను అనుభవిస్తున్నాం . అయితే , నేటి తరానికి వారెవరో , ఎలా , ఉంటారో కనీసం తెలియని పరిస్థితి . విద్యార్థులు రేపటి తరానికి వారసులు ,విషయం గుర్తించిన ఆ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తనలో ఉన్న ఆలోచనకు పదును పెట్టారు . గత పదిహేనేళ్లుగా వినూత్న రీతిలో బోధన చేస్తూ ముందుకు సాగుతున్నారు . ప్రతి రోజూ ఏదో ఒక పర్వదినం ఉంటుంది . ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ముఖ్యంగా దేశ నాయకులు , శాస్త్రవేత్తలు , రాజు కీయ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టిన గొప్పవారి గురించి నేటి విద్యార్థులకు వివరించా లని సంకల్పించారు . చిన్నారులకు కలకాలం గుర్తుండుపోవాలని బొమ్మ గీస్తూ , బోధన చేస్తుండడం విశేషం . ఆ యనే . గంట్యాడ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాద్యాయుడు శ్రీ మండల సత్యన్నారాయణ.

వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు 

మెంటాడ గ్రామానికి చెందిన మండల కన్నయ్య అప్పయ్యమ్మ దపంతుల కుమారుడు సత్యనారాయణ . వీరిది వ్యవసాయ కుటుంబం . చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు వెంటాడే వి . అయితే చదువు అంటే మక్కువ . ఇంటర్ తరువాత విజయనగరంలోని ఎంఆర్ కళాశాల లో డిగ్రీ సీటు పొందారు . అయితే ఆర్ధిక ఇబ్బం దులు మాత్రం విడవలేదు . అదే సమయంలోఅప్పటి కలెక్టర్ నాగిరెడ్డి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర విజయం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఈ కార్యక్రమంలో సత్యనారాయణ వలంటీర్ పని చేసి , మండల స్థాయిలో ఉత్తమ వలంటీర్‌గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు . ఆ ఘటనే ఆయనలో ఉపాధ్యాయుడు కావాలన్న కోరిక కలిగించింది . అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన విద్యా ప్రయాణం . ఉన్నత స్థాయికి చేరింది . అనంతరం ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ కొలువు సాధించారు . మొదట తూర్పుగోదావరి జిల్లాలో పనిచేశారు . అక్కడ నుంచి విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు . గణపతి నగరం మండలం పాతబగ్గాం , ఎరుకుల పేట , విజయనగరం మండలం కొండకరకాం పార శాలల్లో పనిచేశారు . ప్రస్తుతం గంట్యాడ జడ్సీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు .

• ప్రతిభకు గుర్తింపు 

ఉపాధ్యాయుడు సత్యనారాయణ ప్రతిభను 2008వ సంవత్సరంలోనే జిల్లా అధికారులు గుర్తించారు . అప్పటి నోడల్ అధికారి వీరబ్రహ్మేంద్రస్వామి పనిచేసిన సమయంలో ప్రత్యేకంగా గుర్తించారు . అప్పటిలో నిర్వహించిన విజయనగరం ఉత్సలో సత్యనారాయణ గీచిన జాతీయ నాయకుల చిత్రాలను ఎగ్జిబిషన్లో ప్రద ర్శించారు .

 దేశభక్తి ఉండాలనే తపన

 దేశ నాయకులు జయంతి , వర్ణం తులను పురస్కరించుకుని వారివార్ చిత్రాలను ఉపాధ్యా యుడు మండల సత్యనారాయణ స్వయంగా గీసి విద్యార్థు లకు ప్రదర్శించి , బోధన చేస్తున్నా రు . గాందీ , నెహ్రూ , అల్లూరి సీతారామరాజు , సరోజిని నాయుడు , సర్వేపల్లి రాధాకష్టన్ , మదర్ థెరిస్సా ఇందిరా గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్ , పొట్టి శ్రీరాములు తది తర దేశ నాయకులతో పాటు ప్రస్తుత నాయకులు చిత్రాలను కూడా గీసి వారి చరిత్రను విద్యార్థులకు వివరిస్తున్నారు . నాటి నుంచి నేటివరకు 500లకు పైగా చిత్రాలను గీసారు . అలాగే వారికి సంబం ధించిన చరిత్రను కూడా సేకరించి , తన తో పాటు విద్యార్థులకు బోధన ద్వారా తెలియజేస్తున్నారు . తన వద్ద చదువు కున్న విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉం డాలని , నిజాయితీగా బతకాలన్నదే తన ఆశయమని సత్యనారాయణ మాస్టారు చెబుతున్నారు . ఈయన చేస్తున్న ప్రయ త్నానికి పాఠశాల హెచ్ఎం జగన్నాథ రావుతో పాటు తోటి ఉపాధ్యాయులు కూ డా ఎంతో అభినందనలు చెబుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration Teacher Mandala Satyannarayana"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0