Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postmaster job with 10th Class Qualification

పదోతరగతితో పోస్ట్‌మాస్టర్‌
గ్రామీణ డాక్‌ సేవక్‌ల్లో 3,677 ఖాళీలు
పదోతరగతితో పోస్ట్‌మాస్టర్‌ ఉద్యోగం
Postmaster job with 10th Class Qualification

పదో తరగతి అర్హతతో గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగాలను అందుకునే అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మూడువేల ఆరు వందలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.
కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ ఇండియా పోస్ట్‌ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌)ల ఏర్పాటుతో గ్రామాలకు విస్తరించి వాటి ప్రగతికి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ జీడీఎస్‌ల్లోని 3,677 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2707, తెలంగాణలో 970 ఖాళీల్లో బ్రాంచి పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌సేవక్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

ఎవరు అర్హులు?

పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌లో మ్యాథ్స్‌,  ఇంగ్లిష్‌, స్థానిక భాషను తప్పనిసరిగా చదివి ఉండాలి. మొదటి ప్రయత్నంలో పదోతరగతి పాసైనవాళ్లకి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. దీని కోసం ఎంపికైన అరవై రోజుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్‌ను సమర్పించాలి. టెన్త్‌, ఇంటర్‌ లేదా ఆపైస్థాయి తరగతుల్లో కంప్యూటర్‌ను సబ్జెక్టుగా చదివి ఉంటే ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ అవసరం లేదు. కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ఠ వయసు 40 ఏళ్లు దాటకూడదు.
బీపీఎం పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎంపిక తర్వాత జీడీఎస్‌కు అవసరమైన వసతిని తప్పనిసరిగా కల్పించాలి. ఎలాంటి వసతి కల్పించాలనే వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.సైకిల్‌ తొక్కగలిగే నైపుణ్యం అభ్యర్థులకు ఉండాలి. మోటార్‌ సైకిల్‌ నడపగలిగినా సరిపోతుంది. జీవనానికి అవసరమైన ఇతర ఆదాయ వనరులను అభ్యర్థి కలిగి ఉండాలి.

ఒకేసారి ఇరవై పోస్టులకు..

దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను అనుసరించి ఒకేసారి ఒక అప్లికేషన్‌లో ఇరవై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత అర్హతలు ఉండాలి. ఇచ్చిన ప్రాధాన్యాల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది. జనరల్‌, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులు ప్రతి అయిదు ఆప్షన్లకు రూ. 100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపాలి.

రాత పరీక్ష లేదు

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. అదనపు అర్హతలకు వెయిటేజీ ఉండదు. ఒకే మార్కులను పొందినవారు ఉంటే నిబంధనల ప్రకారం ఎంపిక నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపిక అనంతరం ఎస్‌ఎంఎస్‌ అభ్యర్థులకు అందుతుంది. వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది సెలక్షన్‌ జరుగుతుంది. టైమ్‌ రిలేటెడ్‌ కంటిన్యుటీ అలవెన్స్‌ కింద రెండు లెవెల్స్‌లో భత్యాలు అందిస్తారు. బీపీఎంకి (లెవెల్‌-1) కనీస నాలుగు గంటలకు రూ. 12,000; లెవెల్‌-2కి కనీస అయిదు గంటలకు రూ. 14,500 చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్‌ సేవక్‌ లెవెల్‌-1కి కనీస నాలుగు గంటలకు రూ.10,000, లెవెల్‌-2కి కనీస అయిదు గంటలకు రూ.12,000 ఇస్తారు.
రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: నవంబరు 14, 2019
వెబ్‌సైట్‌: http://appost.in/gdsonline

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Postmaster job with 10th Class Qualification"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0