Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Textbooks will be changed from the 1st to 5th grades next academic year

పాఠ్య పుస్తకాలు మారతాయ్
1 నుంచి 5వ తరగతి వరకూ .
అకడమిక్ సలహా బోర్డు సమావేశంలో నిర్ణయం

 వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారనున్నాయి . జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక - 2005 సిఫార్సులు , నూతన విద్యా విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చేయను న్నారు . 21 మంది నిపుణులతో కూడిన ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది . సబ్జెక్టులు , తరగతుల వారీగా ప్రస్తుత పాఠ్యాంశాలు , మార్పులు చేయాల్సిన విధానం పై సూచనలు , సిఫార్సులు చేసింది . పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో 3 రోజులపాటు నిర్వహించిన కార్య శాల ముగింపునకు మంత్రి సురేష్ హాజరయ్యారు . పాఠశాల విద్యలో తీసుకురా నున్న సంస్కరణల్లో భాగంగానే పాఠ్య పుస్తకాల్లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు .
Textbooks will be changed from the 1st to 5th grades next academic year


జిల్లా స్థాయిలో మరోసారి నిపుణులతో కార్యశాలలు నిర్వహించాలని నిర్ణయించారు . ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తారు . ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల పాఠ్య పుస్తకాలను మారిస్తే బాగుం టుందని జాతీయ విద్యా పరిశోధన , శిక్షణ మండలి ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు . మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టను న్నారు . దీనిపై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సూచించారు . ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్య మాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు . ఆంగ్లానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Textbooks will be changed from the 1st to 5th grades next academic year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0