Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The state government has issued guidelines for the management of the village secretariat. .

గ్రామ సచివాలయం నిర్వహణ నిబంధనావళి ఇదే ! సమయపాలన , హాజరులో అలసత్వం తగదు
విధుల్లో గుర్తింపు కార్డు ధరించడం తప్పనిసరి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం . .
The state government has issued guidelines for the management of the village secretariat. .

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సేవలు విస్త రించేందుకు ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారం భించిన గ్రామ వార్డు సచివాలయంలో విధు లు నిర్వహించే ఉద్యోగుల ప్రవర్తనా నియమావ శిని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృ ద్ధిశాఖ జారీ చేసిన గ్రామ సచివాలయం నిర్వ హణ నిబంధనావళిలో స్పష్టం చేసింది . ఉద్యో గులు విధినిర్వహణలో చేపట్టాల్సిన పలు అంశాలను దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు . వాటిలో ప్రభుత్వ సేవలు , సమయపాలన , కార్యాలయ పనివేళలు , గుర్తింపుకార్డులు జారీ వంటి నియమావళి తెలుసుకుందాం .

 ప్రభుత్వ సేవలు . . విలువలు 


  • గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ విధి నిర్వహణలో స్వతంత్రంగా , నిష్పక్షపాతంగా వ్యవహరించాలి . 
  • హోదాను , పదవిని దుర్వినియోగం చెయ్యరాదు . 
  • ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయు టకు ప్రోత్సహించే విధంగా గ్రామ సచివాలయ అధికారులు , ప్రజానీకం మధ్య సానుకూల , నిజాయితీతో కూడిన , పారదర్శ కమైన , బాధ్యతాయుతమైన పరస్పర సమ న్వయం ఉండేలా చూడాలి . 
  • స్థానిక , జాతీయ , అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలి . 
  • నిజాయితీకి ప్రతి ఉద్యోగి కట్టుబడి ఉండాలి .
  •  ప్రజా అవసరాలు వేగంగా , అత్యంత చురుకై న , సమర్థవంతమైన , నాణ్యతను పెంచే లక్ష్యంగా సేవలు ఉండాలి . 
  • సచివాలయ ఉద్యోగులు , అధికారులు ప్రభుత్వ భవనాలు , వాహనాలు , ఇతర వనరులను పొదుపుగా , సమర్థవంతగా ఉపయోగించాలి .
  • ఆ అధికారాలను బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సదరు విధి నిర్వహణలో గమనించబడిన లోపాలకు సదరు ఉద్యోగు లను , పర్యవేక్షక విధుల్లో లోపాలకు పంచాయతీ కార్యదర్శిని బాధ్యులు చేస్తారు .

 సమయ పాలన - హాజరు 


  •  గ్రామ సచివాలయంలోని ఆఫీసు ఆటెండరు మినహా మిగిలిన సిబ్బంది అందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 . 30 గంటల వరకూ విధులను నిర్వహించాలి . 
  • అత్యవసర సమయాల్లో , ప్రకృతి వైపరీత్యా లు , ఎలక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో సామాన్య పనివేళలకు మించి అవసరానికి ఆనువుగా పచిచెయ్యాల్సి ఉంటుంది . 
  • అందరు సచివాలయ సిబ్బంది తమ హాజరును బయోమెట్రిక్ , అటెంటెన్స్ రిజిస్ట రులో సంతకం చేయాలి
  •  . ఇ - రిజిస్టర్ను పంచాయతీ కార్యదర్శి  జూనియర్ అసి స్టెంట్ ఆధీనంలో ఉంచాలి . 
  •  ఆధునిక హాజరు పర్యవేక్షణా వ్యవస్థను అన్ని గ్రామ పంచాయతీల్లో దశల వారిగా ఏర్పాటు చేయుటకు ప్రతి ఉద్యోగికి పంచింగ్ కార్డులు అందిస్తారు . 
  • ప్రవేశ , నిర్దేశిత స్థానాల రికార్డులు , మినిట్ బుక్ ఏర్పాటు చేస్తారు . 
  • క్షేత్ర పర్యటనను పర్యవేక్షించే కంప్యూటరీకర ణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు . - 
  • ఆలస్యంగా హాజరైన వారిని లేట్ అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేసి వారి పేరు ఎదురుగా లేట్ అని రాయాలి . 
  • మూడు లేట్ హాజరులను ఒక క్యాజువల్ లీవ్ గా పరిగణించబడుతుంది .
  •  ప్రతిరోజు ఆలస్యంగా వచ్చేవారిపై క్రమశిక్ష ణా చర్య తీసుకొనబడుతుంది . 
  •  ఆలస్యంగా హాజరు కావటానికి రాతపూర్వకమైన అనుమతిని సంబంధిత సిబ్బంది నుంచి ముందస్తుగా తీసుకోవాలి . 
  • అటువంటి ఆలస్యం 1 గంటకు మించరాదు . అట్టు మించినచో ఆలస్యమైన హాజరు ఆర్ధరోజు సాధారణ సెలవుగా పరిగణిస్తారు . 
  • ఒక నెలకు 3కి మించి ఆలస్య అనుమతులు ఇవ్వరాదు . మధ్యాహ్న భోజన విరామం 30 నిమిషాలు ఇవ్వబడును 
  • మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల్లోపు మధ్యలో భోజన విరామం సమయంలో ఫ్రంట్ ఆఫీస్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి . 
  • శుక్రవారం జూమా ప్రార్థనలు చేయువారి కొరకు మధ్యాహ్నం 12 . 30 నుంచి 2 . 30 గంటల వరకు మినహాయింపు ఇస్తారు . 
  • ఆవ సరమైన సందర్భాల్లో ఈ మినహాయింపు సమయాన్ని అదనపు పనివేళల్లో పనిచేసేలా వినియోగించబడును . 
  • ఆవశ్యకత బట్టి సెలవు దినముల్లో కూడా పనిచేయుటకు పంచాయతీ కార్యదర్శి కార్యా లయం ఉత్తర్వులను ఇస్తుంది .
  •  అటువంటి పనికి కాంపన్సేటరీ లీవ్ ఇస్తారు . ఈ విషయా న్ని డ్యూటీ రిజిస్టరులో , అటెండెన్స్ రిజస్టరు ల్లో స్పష్టంగా నమోదు చెయ్యాలి . 
  • గ్రామ పంచాయతీ కార్యదర్శికి మాత్రం ఇటువంటి కాంపన్సెటరీ సెలవుకు అర్హత లేదు . 
  •  కార్యాలయ పనివేళలను సచివాలయంలో ఫ్రంట్ ఆఫీసులో ప్రదర్శించాలి .

 కార్యాలయ ముద్రలు తప్పనిసరి 

గ్రామ సచివాలయం నుంచి జారీ చేయబడే అన్ని సర్టిఫికెట్స్ , అనుమతులు , మాన్యువల్ గా మెయింటైన్ చేయబడ్డ నోట్ ఫైల్స్ మీద పంచాయతీ కార్యదర్శి మరియు ఫంక్షనల్ అసిస్టెంట్ యొక్క సీల్ , పేరు , హోదామరియు ఫోన్ నెంబరు ఉండేలా చూడాలి . కార్యాలయం ముద్ర పంచాయతీ కార్యద ర్శి , డిజిటల్ ఆసిస్టెంట్ యొక్క ఆధీనంలో మాత్రమే ఉండాలి .

గుర్తింపు కార్డులు ధరించాలి 


  • గ్రామ సచివాలయ సిబ్బంది కార్యాలయ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తింపు కార్డును ధరించాలి . 
  • ఆ పంచాయతీ కార్యదర్శి గుర్తింపు కార్డును మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు జారీ చేస్తారు . 
  • గుర్తింపు కార్డు ప్రభుత్వం వారు సూచించిన నమూనా మేరకే ఉండాలి .
  •  జారీ చేసిన గుర్తింపు కార్డు వివరాలు రిజిస్ట రులో నమోదు చెయ్యాలి . 
  • విధుల నుంచి బదిలీ అయినప్పుడు కార్యాలయానికి అప్ప గించాలి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The state government has issued guidelines for the management of the village secretariat. ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0