Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

World teacher's day special

వృత్తి వత్తిళ్లలో ఉపద్యాయులు.

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం . ఈ సందర్భంగా జగమెరిగిన ఉపాధ్యాయ వృత్తిని , వివిధ దేశాల్లో ఉపాధ్యాయుల పరిస్థితిని పరామర్శించడం పరిపాటి . ' ఏమి చదువుతున్నావ్ , చదువుకుని ఏమి కావాలనుకుంటున్నావ్ ' అని పిల్లలను పెద్దలు అడగడం , విద్యార్థులను అధికారులు ప్రశ్నించడం ఆనవాయితీ . ' కలెక్టర్ అవుతా , డాక్టర్ అవుతా , లాయర్ అవుతా , టీచర్ అవుతా ' అని పిల్లలు జవాబు చెబుతుంటే ' శభాష్ , వెరీ గుడ్ అని ప్రోత్సహించడం షరా మాములే . కాగా ' వర్కీ ఫౌండేషన్ ' అనే అంతర్జాతీయ సంస్థ అధిక జనాభా గల 35 దేశాలలో 2013 లోనూ , 2018 లోనూ ఓ సర్వే చేసింది . 
World teacher's day special

సమాజానికి ఉపయోగపడుతున్న 14 రకాల వృత్తులలో దేనికి ఏ ర్యాంక్ యిస్తారో చెప్పాలని ప్రతి దేశంలో వెయ్యి మంది సాధారణ ప్రజల అభిప్రాయాలను సేకరించింది . హయ్యస్ట్ ర్యాంక్ 14 నుంచి లోయెస్ట్ ర్యాంక్ 1 వరకు వివిధ వృత్తుల వారి యావరేజ్ ర్యాంకులలో మూడు స్థాయిల ( హెడ్మాస్టర్ , సెకండరీ , ( ప్రైమరీ ) ను కలిపి చూస్తే ఉపాధ్యాయులకు మధ్యస్థంగా 7వ ర్యాంక్ లభించింది . ఆయా వృత్తులు , వాటి ర్యాంకులు ఇలా వున్నాయి : 1.డాక్టర్ ( 116 ) ; 
2.లా యర్ ( 9.5 ) , 3.ఇంజినీర్ (9.1), 4.హెడ్ టీచర్ (8.1) , 5.పోలీస్ ఆఫీసర్ (7.8) ; 6.నర్స్ (7.4 ) , 7.ఎకౌంటెంట్ (7.3) ; 8.స్థానిక ప్రభుత్వ అధికారి (7.3) , 9 . మేనేజిమెంట్ కన్సల్టెంట్ (7.1) ; 10 . సెకండరీ స్కూల్ టీచర్ (7.0) , 11 . ప్రైమరీ స్కూల్ టీచర్ (6.4) , 12 . వెబ్ డిజైనర్ (5.9) , 13 . సోషల్ వర్కర్ ( 5 . 8 ) ; 14 . లైబ్రేరియన్ ( 46 ) . 

ప్రజాభిప్రాయం మేరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కంటే సెకండరీ స్కూల్ టీచర్లకు , వారికంటే హెడ్మాస్టర్లకు ఎక్కువ గౌరవం లభిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది . ఇతర వృత్తులతో పోల్చితే డాక్టర్లతో సమానమని చైనా , మలేషియా , రష్యా , దేశాల వారు చెబితే , లైబ్రేరియన్లతో సమానమని ఇండియాతో సహా అమెరికా , స్పెయిన్ , టర్కీ , కెనడా , ఫ్రాన్స్ దేశాల్లో చెప్పారట . ఉపాధ్యాయులు బుక్కిష్ నాలెడ్డి మాత్రమేనని ఇస్తారని వారి అభిప్రాయం కావచ్చు . ఎక్కువ దేశాల్లో సోషల్ వర్కర్సుతో సమానమని కూడా చెప్పినట్లు సర్వేలో నమోదు చేసారు . సంపద , ఆదాయం , ఆర్థిక హోదాను బట్టి సామాజిక హోదా వుంటుందనే విషయం తెలిసిందే . పనికి తగిన వేతనం కావాలనే డిమాండ్ సర్వే సర్వత్రా ఉంటుంది . కాగా సింగపూర్ , స్పెయిన్ , జర్మనీ , స్విట్జర్లాండ్ తదితర కొన్ని దేశాల్లో ఉపాధ్యాయులకు అధిక జీతాలు లభిస్తున్నా చాలా దేశాల్లో తక్కువ జీతాలే చెల్లించడం జరుగుతోంది . ' ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ ( పిఐ ఎస్ఏ ' ద్వారా వివిధ దేశాల్లోని పదిహేను సంవత్సరాల వయసు గల విద్యార్థులకుమూడేళ్లకోసారి చదవడం , లెక్కలు చేయడం , సైన్స్ పరిజ్ఞానంలో అంతర్జాతీయ పరీక్ష నిర్వహించబడుతోంది . అందులో అధికంగా అభ్యసన సామర్థ్యాలు సాధించిన విద్యార్థులు ఉండే దేశాల్లోని ఉపాధ్యాయులకు జీతాలు కూడా అధికంగా వున్నట్లు తెలుస్తోంది . చైనా , ఇండియా , మలేషియా , ఘనా మరో నాలుగు దేశాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తమ బిడ్డలు ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది . ప్రజల అభిప్రాయాలు , తల్లిదండ్రుల ఆకాంక్షలు , అధిక జీతాలు , వృత్తిలో నైపుణ్యత , బోధనా సామర్యం , విద్యార్థుల అభ్యసన సాయి మున్నగు ప్రాతిపదికల ఆధారంగా ఉపాధ్యాయులకు లభిస్తున్న గౌరవాన్ని బట్టి ' గ్లోబల్ టీచర్ స్టేటస్ ఇండెక్స్ 2018 " రూపొందించబడింది . ఒకటి నుంచి మద ర్యాంకుల ఇండెక్సులో చైనా టీచర్లకు మొదటి ర్యాంక్ లభించగా , భారత దేశ ఉపాధ్యాయులకు ఎనిమిదో ర్యాంక్ వచ్చింది .

 వివిధ దేశాల ఉపాధ్యాయులకు వచ్చిన ర్యాంకుల వివరాలు : 1 చైనా ( 100 . 0 ) , 2 , మలేషియా ( 938 ) , 3 . తైవాన్ ( 10 ) , 2 ) , 4 , రష్యా ( 65 . 0 ) , 5 . ఇండోనేషియా ( 622 ) , 6 , కొరియా ( 61 , 2 ) , 7 . టర్కీ ( 591 ) ; 8 , ఇండియా ( 58 . 1 ) ; 4 . న్యూజిలాండ్ ( 56 . 0 ) ; 10 , సింగపూర్ ( 517 ) , అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్ 13 , అమెరికా 16 , ఫిన్లాండ్ 17 మరియు జపాన్ 18 స్థానాల్లో వున్నవి . జన్మనిచ్చేది తల్లిదండ్రులే అయినా జీవితాన్నిచ్చేది ఉపాధ్యాయులే అంటారు . గురువులు తల్లిదండ్రులతో సమానం అనే నానుడి వుంది . అయినా ప్రపంచంలో సమాజానికి ఉపయోగపడే వృత్తుల్లో మొదటి స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఏడో స్థానంలో ఎందుకున్నారు ? గురువును దైవంతో సమానంగా భావించి గురుపూజోత్సవాలు నిర్వహించే భారత దేశంలోఎనిమిదో స్థానమే దక్కడమేమిటి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పరిష్కార మార్గాలను అనుసరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే వుంది . వర్కీ ఫౌండేషన్ సర్వేలో ఉపాధ్యాయుల హోదాను పరిశీలించడానికి ఎంచుకున్న ప్రాతిపదికల కంటే మౌలికమైనది విద్యారంగం . ఏ దేశంలో విద్యారంగానికి ఎంత ప్రాధాన్యత వుంటుందో ఆ దేశంలో ఉపాధ్యాయులకు అంతటి గౌరవం హోదా లభిస్తుందనేది అసలు ప్రాతిపదిక . మార్కెట్ యుగంలో పోటీ ప్రపంచంలో విద్యారంగం , ఉపాధ్యాయ వృత్తి అనేక సవాళ్ళను ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయి . ఉపాధ్యాయిల పని హాయిగా ఉంటుందని , త్వరగా ఇంటికి వెళ్తారని , సెలవులు ఎక్కువని చెప్పుకుంటారు . కానీ ఇటీవల నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనే సంస్థ ఓ . ఈ సిడి దేశాల్లో చేసిన సర్వేలో ఉపాధ్యాయులే అధిక ఒత్తిడికి గురవుతున్నారని తేల్చింది

 ప్రతి వందమంది ఉపాధ్యాయుల్లో ఇరవైమంది . వృత్తిపరమైన ఒత్తిడితో వున్నట్లు , ఇతర వృత్తుల వారిలో పదమూడు మందే అలా ఫీలవుతున్నట్లు చెప్పారు . సెలవుల్లో కూడా వృత్తికి సంబంధించిన పని చేయాల్సి వస్తుందని ప్రతి ఐదుగురిలో ఇదరు ( 40 % ) టీచరు చెబితే ఇతర వృత్తులో వారిలో 32 % మందే చెప్పారు . తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయుల్లో చాలామంది దసరా , సంక్రాంతి సెలవుల్లో పరీక్ష పేపర్లు దిద్దడం , సీసీఈ రికార్డులు రాసుకోవడం తెలిసిందే . ఢిల్లీలోని 60 వేలమంది ఉపాధ్యాయులు ఏడాదికి 30 లక్షల గంటలు పరీక్షల కోసమే వెచ్చిస్తున్నట్లు , ఒక హెడ్మాస్టర్ 30 గంటలు ప్రోగ్రెస్ కార్డుల పనిలో సతమతమవుతున్నట్లు ఢిల్లీలోని ప్రభుత్వం చెప్పింది .
 అలాంటి అదనపు పని వత్తిడిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది . అన్ని దేశాల్లోని , రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయుల పని ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలి . మీక్షలు , మీటింగులు , సర్వేలు వంటి బోధనేతర పనులు తగ్గించాలి . వృత్తి ఒత్తిళ్ళను తట్టుకుంటూ ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే బోధనా సామర్థ్యం పెరిగేది . ఏ వృత్తి అయినా ' అప్ డేట్ అవుతుంటేనే సమాజంలో తన అవసరాన్ని , హోదాని నిలబెట్టుకుంటుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్న మాట సంపూర్ణ సత్యం . ఈ గురుతర బాధ్యతను నేటి యువతరం ఉపాధ్యాయులు స్వీకరించాలన్నదే 2019 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందేశం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "World teacher's day special"

Post a comment