Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Exam Schedule Release

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
APPSC Exam Schedule Release

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రకటించారు. ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ మధ్య ఏడు పేపర్ల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను డిసెంబరు 12 నుంచి 23 మధ్య నిర్వహించాలని మొదట నిర్ణయించారు. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలలో ఆలస్యం కారణంగా పరీక్షల సన్నద్ధతకు సమయం సరిపోదని, పరీక్ష తేదీలను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ.. ఫిబ్రవరి 4న తెలుగు, 5న ఆంగ్లం, 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్ష నిర్వహించనుంది. అటవీశాఖ రేంజి ఆఫీసరు ఉద్యోగ నియామకాల రాత పరీక్షలను మార్చి 17, 18, 19 తేదీల్లో, డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసరు పరీక్షలను మార్చి 19, 20న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
*®APPSC: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు వెల్లడి..*

*గ్రూప్-1 పరీక్ష షెడ్యూలు..*

*పరీక్ష పరీక్ష తేదీ*
*తెలుగు పేపర్ (అర్హత పరీక్ష) 04.02.2020*
*ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష) 05.02.2020*
*పేపర్-1 07.02.2020*
*పేపర్-2 10.02.2020*
*పేపర్-3 12.02.2020*
*పేపర్-4 14.02.2020*
*పేపర్-5 16.02.2020*


*®గ్రూప్-1 పోస్టుల వివరాలు*

*®ఏపీలో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.*

*పోస్టుల సంఖ్య: 169*
*పోస్టులు పోస్టుల సంఖ్య*
*డిప్యూటి కలెక్టర్లు(ఏపీ సివిల్ సర్వీస్) 30*
*అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్(ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్) 08*
*డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-సివిల్(ఏపీ పోలీస్ సర్వీస్) 28*
*డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(ఏపీ జైల్ సర్వీస్) 02*
*డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్(ఏపీ ఫైర్ సర్వీస్) 01*
*అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్) 13*
*రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్(ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) 05*
*అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏపీ ఎక్సైజ్) 11*
*ఎంపీడీవో(ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్) 48*
*డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్(ఏపీ రిజిస్ట్రేషన్ సర్వీస్) 01*
*డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్* *ఆఫీసర్(ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్) 02*
*డిప్యూటీ రిజిస్ట్రార్స్(ఏపీ కోఆపరేటివ్ సర్వీస్) 02*
*డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్) 01*
*డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్) 01*
*డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్) 01*
*డిస్ట్రిక్స్ పంచాయత్ ఆఫీసర్స్(ఏపీ పీఆర్ఆర్‌డీఎస్) 01*
*మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II)(ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్) 01*
*అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ (గ్రేడ్-II)(ఏపీ మెడికల్ & హెల్త్ (అడ్మినిస్ట్రేషన్) సర్వీస్) 06*
*అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్) 07*
*మొత్తం ఖాళీలు (పాతవి -44, కొత్తవి - 125) 169*
®

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Exam Schedule Release"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0