Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

English Medium one to 6th grade from next academic year

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వరకు ఇంగ్లీషు మీడియం
  • రేపు మనబడి నాడు - నేడు
  • అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషుల్యాబ్స్
  • జనవరి 1 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
  • డిసెంబర్‌లోగా పాఠ్యప్రణాళిక సిద్ధంచేయాలి : సీఎం.జగన్
English Medium one to 6th grade from next academic year

  • వచ్చే విద్య సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు . - తరువాత ఒక్కో ఏడాది మిగిలిన తరగతుల్లో ఇంగ్లీష్ విద్యాబోధన ప్రారంభం కావాలని స్పష్టం చేశారు . మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయం లో వివరాలు అధికారులతో  సమీక్షించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 14వ రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు . మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు . ఒకటి నుంచి ఆరు తరగతులు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన అనంతరం తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యాబోధన చేపట్టడం వల్ల ప్రతి విద్యార్థికి నాలుగేళ్ళ సమయం ఉంటుందని దీంతో వారికి ఇంగ్లీష్ పై చక్కని పట్టు లభించే అవకాశం ఉందన్నారు . 


అయితే తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా బోధించాలని స్పష్టం చేశారు . ఇది అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని ప్రతి విద్యార్థి సీబీఎస్సీ ,ఐసీఎస్యూ పరీక్షలు రాసే స్థాయికి ఎదిగేదా అత్యంత నాణ్యత ప్రమాణాలతో బోధనలు జరగాలని ఆదేశించారు . కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు . అదేవిధంగా బోధనకు సంబంధించి జనవరి 1 నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు . డిసెంబరులో , పాఠ్య ప్రణాళికను ఖరారు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు . ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని తాయిలెట్ల ఫ్యాన్ లైట్లు , తాగునీరు , ఫర్నీచర్ , పెయింటింగ్ పనులు , మరమ్మత్తులు , గ్రీన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు . ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు , ప్రహారీ గోడల నిర్మాణం జరగాలని ఆదేశించారు . పాఠశాలల అభివృద్ధిలో పాఠశాల విద్యకమిటి ని భాగస్వామ్యం చేసి వ్యవస్ట లో సమూల మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు . నాడు నేడు పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో తాను ఈ నెల ప్రారంభించనున్నట్లు తెస్తారు . తొలి విడతలో పాఠశాలల అభివృద్ధి మరమ్మత్తుల నిమిత్తం రూ . 3 . 500 కోట్లను వెచ్చించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు . ఇంత పెద్ద ఎత్తున నిధులు గతంలో ఎన్నడూ ఖర్చు చేయలేదని ప్రతి జిల్లాలో మూడింట ఒక వంతు పాఠశాలలను తొలి విడతలోనే అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు . మంత్రులు , ఎమ్మెల్యేలు , పాఠశాలలు అభివృద్దలో భాగస్వాములు కావాలని ఆదేశించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "English Medium one to 6th grade from next academic year"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0