Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vinadam Nerchukundaam Radio Lesson

Vinadam Nerchukundaam Radio Lesson
<><><><><><><><><><>
💁‍♂ *"విందాం - నేర్చుకుందాం"*
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 13.11.2019
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "ప్రయత్నిస్తే"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు

Vinadam Nerchukundaam Radio Lesson

〰〰〰〰〰〰〰〰
✳ *ప్రయత్నిస్తే*
〰〰〰〰〰〰〰〰
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• విద్యార్ధులు ప్రయత్నంతో ఏ పనినైనా సాధించగలమని తెలుసుకుంటారు
• పాఠాన్ని ధారాళంగా చదివి అర్ధం చేసుకొనగల్గుతారు. అందుకు సూచించిన పేరాను పాఠంలో భాగంగా చదువుతారు.
• విన్న పాఠం పై చదివిన పేరా పై అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు.
• పదసంపదలో భాగంగా ఇచ్చిన పదాలకు రేడియో సూచనల ననుసరించి జవాబునిస్తారు.
• గేయం/ పాట రూపంగా పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుంటారు. పాటను పాడి ఆనందానుభూతి పొందుతారు.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
1. చీటీలు    2. స్కేచ్ పెన్నులు     3. చార్టు     4. సుద్దముక్కలు     5.  5వ తరగతి  తెలుగు పాఠ్యపుస్తకం.
★★★★★★★★★★★★★
*ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠాన్ని వినడానికి పిల్లలను సిద్ధపరచాలి.
ఆ) కార్యక్రమానికి కావలసిన బోధనోపకరణలను సమకూర్చుకోవాలి.
ఇ) కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించేవిధానం తెలియాలి.
★★★★★★★★★★★★★
*ఆట -1:*
• విద్యార్ధులు వృత్తాకారంగా నిలబడాలి.
• పిల్లిలా 'మ్యావ్.... మ్యావ్...' మంటూ చుట్టూ తిరగాలి.
• కప్పలా బెక్ బెక్ మంటూ చుట్టూ తిరగాలి.
• కోతిని అనుకరిస్తూ నడవాలి.
• సిపాయిలా భుజం పై తుపాకీ వేసుకొని 'లెఫ్ట్.. . . రైట్' అంటూ నడవాలి
• పిల్లలంతా కారు నడుపుతున్నట్టు హారన్ శబ్దం మోగిస్తున్న శబ్దం చేస్తూ చుట్టూ తిరగాలి.
*ఆట -2:*
• ముందుగా సిద్ధం చేసుకున్న చీటీలను తరగతి మధ్యలో వృత్తం గీచి అందులో పెట్టాలి.
• ఒక విద్యార్ధికి ఒక చీటీనివ్వాలి. అలా 5గురు విద్యార్ధులకు ఇవ్వాలి.
• చీటీ తీసుకున్న మొదటి విద్యార్ధి వృత్తం చూట్టూ తిరగాలి. మ్యుజిక్ ఆగి పోయినంతనే ఆగి పోవాలి.
• తను ఆగిన చోటికి సమీపంలో ఉన్న విద్యార్ధుకి ఆ చీటీ నివ్వాలి.
• చీటీ అందుకున్న విద్యార్థి అందులో పదానికి 'సూచన' ఆధారంగా స్పందించాలి
• ఇలా 5గురి విద్యార్ధులచే ఆట ఆడించాలి. సూచనలకు / సమయానికి లోబడి ఆటను పూర్తి చేయాలి.
★★★★★★★★★★★★★
*కృత్యాలు*
కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలను నిర్వహించడం పట్ల అవగహన కలిగి ఉండాలి.
*కృత్యం 1:*
• రేడియోలో పాఠం ఎంత వరకు విన్నది రేడియో టీచర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్ధులు జవాబు చెప్పేలా సంసిద్ధపరచాలి.
• 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 83వ పేజీలో మొదటి మూడు లైన్లను విద్యార్ధులచే చదివించాలి.
• ఆ పేరా పై రేడియో టీచర్ అడిగిన ప్రశ్నలకు జవాబు సిద్ధం చేయాలి.
*కృత్యం 2:*
టీచర్ ఈ క్రింది పదాలను ఒక్కొక్క చీటి పై ఒక్కోక్కటి రాయాలి.
1. ఉత్కంఠ    2, హడావుడి.    3. బిడియం    4. తపన     5. అభినందన.
★★★★★★★★★★★★★
🎼  *పాట*
*ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*

🎤 *పల్లవి :*
ప్రయత్నమంటూ జరిగిందంటే
సాధిస్తారండోయ్! బాలలు సాధిస్తారండోయ్
భయపడకుండా ముందుకు పోతే
అందును ఫలితాలోయ్ !
బాలలు అందును ఫలితాలోయ్    //ప్రయత్నమంటూ//

🎻 *చరణం 1:*
శర్మిల పాప పిల్లి బొమ్మను తయారు చేసిందోయ్
బొమ్మదాచుకో బాగోలేదని హేళన చేసారోయ్
ఎందరు కాదు, కూడదు అన్నా ముందుకు సాగిందోయ్
హెడ్మాష్టరును కలసి చివరకు బొమ్మను పెట్టిందోయ్   //ప్రయత్నమంటూ//

🎻 *చరణం 2:*
ప్రదర్శనలో తన బొమ్మను చూసే తపనే బాగుందోయ్
ముందుకు వచ్చి ప్రయత్నించిన తీరే బాగుందోయ్
పనిని ప్రేమించు గుణమే మీకు తప్పక కావాలోయ్
శర్మిలలాగే ప్రశంసలంది పేరు వచ్చునండోయ్ !   //ప్రయత్నమంటూ//

★★★★★★★★
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
★★★★🔚🙋‍♂★★★★

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vinadam Nerchukundaam Radio Lesson"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0