Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for Sukanya Abundant holders

సుకన్య సమృద్ధి ఖాతాదారులకు  శుభవార్త

Good news for Sukanya Abundant holders

సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి ప్రస్తుతం చాలా మందికి అవగాహన కలిగి ఉంటుంది. ఆడ పిల్లల ఆర్థిక భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన పథకం ఇది. పది సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడ పిల్లల పేరుపై ఈ అకౌంట్‌ను తెరవొచ్చు. పోస్టాఫీస్, బ్యాంకులకు వెళ్లి ఈ సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు.

అయితే పోస్టాఫీస్‌ లో సుకన్య సమృద్ధి అకౌంట్‌ కలిగిన వారికి ఇప్పుడు తీపికబురు ఒకటి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్‌ కు సంబంధించిన రూల్స్‌ ను కాస్త సవరించింది.
దీనితో సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం పొందుతారు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్‌ డీ అకౌంట్ ఉన్న వారికి కూడా లాభం ఇప్పుడు లభించనుంది.
కొత్త నిబంధన వల్ల ఇకపై నాన్ హోమ్ పోస్టాఫీస్‌ బ్రాంచ్‌ కు వెళ్లి చెక్‌ బుక్ ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. ఇప్పటిదాకా అయితే రూ.25,000కు పైన చెక్‌ లను ఇతర పోస్టాఫీస్ బ్రాంచ్‌ లకు వెళ్లి డిపాజిట్ చేయడానికి కస్టమర్లకు అవకాశం లేదు. దీనితో పోస్టాఫీస్‌లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి కాస్త ప్రయోజనం లభించనుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వాటిల్లో ఇతర బ్రాంచులలోనూ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్‌ బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఇండియా పోస్ట్ ఈ మేరకు తన నిబంధనల్లో మార్పులు చేసింది.

సీబీఎస్ పోస్టాఫీస్‌ లు ఇష్యూ చేసిన అన్ని రకాల పీఓఎస్‌బీ చెక్స్ అన్నీ ఏ బ్రాంచుల్లో అయిన సరే ఇకపై తీసుకుంటారు. దీనితో పోస్టాఫీస్‌ లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారి అకౌంట్‌లో లేదా రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి అకౌంట్లలో చెక్‌ ను డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే అప్పుడు చెక్ పరిమితి రూ.25,000 వరకు మాత్రమే ఉంటుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్‌ ను ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఓపెన్ చేసుకోవచ్చు. వీరికి పది సంవత్సరాలలోపు వయసు ఉండాలి. దత్తత తీసుకున్న ఆడ పిల్ల పేరుపై కూడా సుకన్య అకౌంట్ తెరవొచ్చు. ఒకవేళ కవలలు పుడితే అప్పుడు ఒక కుటుంబంలో గరిష్టంగా ముగ్గురి పేరుపై కూడా సుకన్య అకౌంట్ ప్రారంభించొచ్చు.

FULL DATAIS OF SUKANYA

SUPER BENIFITS  SUKANYA 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for Sukanya Abundant holders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0