Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Railways is preparing to increase the rail fare

ALSO READ:

Home Loan Best in this bank!

Ammavadi CHECK LIST

RAILWAY JOBS



ఇక రైలు చార్జీల మోత..


Indian Railways is preparing to increase the rail fare

రైలు చార్జీలను భారీగా పెంచేందుకు భారతీయ రైల్వే లు రంగం సిద్ధం చేస్తున్నాయి. 
అన్ని రైళ్లు, తరగతుల వారీగా ప్రయాణీకుల చార్జీలను ఈ వారంలోనే పెంచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉంటుందని ప్రముఖ హిందీ పత్రిక కథనం వెల్లడించింది. రైలు చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్‌లోనే ప్రధాని కార్యాలయం ఆమోదముద్ర వేసినా జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనలో జాప్యం నెలకొంది. ఆర్థిక మందగమనం ప్రభావంతో రైల్వేల ఆర్థిక వనరులపై ఒత్తిడి అధికమైంది.
ఇక రోడ్డు రవాణా నుంచి దీటైన పోటీ ఎదురవడంతో సరుకు రవాణా చార్జీలను పెంచే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణీకుల విభాగం నుంచి వచ్చే రాబడిపైనే రైల్వేలు కన్నేశాయి. గత రెండేళ్లుగా ప్రయాణీకుల చార్జీలను నేరుగా పెంచకపోవడంతో తాజాగా చార్జీల పెంపునకే మొగ్గుచూపారు. గతంలో కొన్ని రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ వ్యవస్ధతో పాటు రిఫండ్‌ వ్యవస్థలో మార్పులు వంటి చర్యలతో రాబడి పెంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రైల్వేల మొత్తం రాబడి గణనయంగా తగ్గి రూ 13,169 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా మొత్తం వ్యయం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. వ్యయ నియంత్రణతో పాటు రాబడి పెంపునకు చార్జీల వడ్డన ద్వారా సమతూకం సాధించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Railways is preparing to increase the rail fare"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0