Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for those earning less than Rs 7 lakh

7లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి గుడ్ న్యూస్
Good news for those earning less than Rs 7 lakh

దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థికమాంద్యానికి విరుగుడు చర్యలు చేపట్టడానికి మోడీ సర్కారు రెడీ అయ్యింది. పడిపోయిన కొనుగోళ్లను ఆర్థిక మందగమనాన్ని సరిదిద్దేందుకు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలోని పారిశ్రామిక మేధావుల అభిప్రాయాలను తీసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో గొప్పవరాలు ప్రకటించడానికి రెడీ అయ్యింది.బడ్జెట్ అనగానే సాధారణ ప్రజల నుంచి ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు తమకు ఏంలాభం కలుగుతుందని ఆశిస్తారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడానికి నిర్మలా సీతారామన్ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు సమాచారం.
దేశంలోని వేతన జీవులకు ఊరటనిచ్చేలా రూ.7లక్షల వరకూ ఆదాయపు పన్ను పరిమితిని 5శాతానికే ప్రతిపాదించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే గత ఏడాది ఫిబ్రవరి లో ప్రకటించిన మధ్యంత బడ్జెట్ లో రూ.5లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. అదే రీతిలో వ్యక్తిగత ఆదాయం విషయంలో పన్నుల శ్లాబులను మార్చడానికి కేంద్రం రెడీ అయ్యింది.

ప్రస్తుతం సంవత్సరానికి రూ.2.5లక్షల వార్షిక ఆదాయం ఉంటే ఎలాంటి పన్నులు లేవు. ఇప్పుడు దాని పరిమితిని 5 లక్షలకు పెంచారు. ఇక రూ.5లక్షలు దాటిన వారిని రూ.7లక్షల లోపు ఆదాయం ఉంటే కేవలం 5శాతం పన్ను విధించేందుకు కేంద్రం రెడీ అవుతోందట.. ప్రస్తుతం 5లక్షల నుంచి 10 లక్షలలోపు ఆదాయం ఉన్నా వారికి ఏకంగా 20శాతం పన్ను కడుతున్నారు. 10లక్షలు పైనుంటే ఏకంగా 30శాతం పన్ను కడుతున్నారు. ఇప్పుడు వీటిని సంస్కరించడానికి కేంద్రం రెడీ అయ్యింది.

5-7లక్షల ఆదాయానికి 5శాతం 10-20 లక్షల వార్షిక ఆదాయానికి 20శాతం పన్ను.. రూ20-10 కోట్ల మధ్య ఆదాయం ఉంటే 30శాతం పన్ను ప్రతిపాదించే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే జరిగితే వేతన జీవులకు తక్కువ జీతం ఉండే `10లక్షల లోపు ఆదాయం గల వారికి గొప్ప ఊరటగా చెప్పవచ్చు. కేంద్రం కనుక ప్రకటిస్తే లక్షలు వేతన జీవులకు మిగులుతాయి. తద్వారా కొనుగోళ్లు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడే అవకాశాలుంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for those earning less than Rs 7 lakh"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0