Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Services to any Bank Customers in Postal Bank ..!

పోస్టల్ బ్యాంక్‌లో ఏ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లకైనా సేవలు..!
Services to any Bank Customers in Postal Bank ..!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అదిరిపోయే న్యూస్ తీసుకువచ్చింది. ఏ బ్యాంకుకు చెందిన కస్టమర్లు అయినా సరే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చంటోంది. క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులు పొందొచ్చని తెలిపింది.


  • ప్రధానాంశాలు:
  • ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులు లాంచ్ చేసిన ఐపీపీబీ
  • దీంతో ఇంటర్ ఆపరబుల్ సేవలు
  • క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ విచారణ వంటి సర్వీసులు
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ ప్రయోజనం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తాజాగా ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులను ఆవిష్కరించింది. అన్‌బ్యాంక్డ్, అండర్ బ్యాంక్డ్ కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోపే కోటి మంది కస్టమర్లకు చేరువ అయ్యామని బ్యాంక్ తెలిపింది.
బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనివారికి ఐపీపీబీ సేవలు అందుబాటులోకి రావాలని ఆయన పేర్కొన్నారు. ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద 34 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో 22 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతానికి చెందినవి. ఐపీపీబీ ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసుల వల్ల వీరికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుతాయి. అంతేకాకుండా ఏ బ్యాంక్‌‌కు చెందిన కస్టమర్లకైనా సేవలు అందించొచ్చు.
ఆధార్ అధారిత పేమెంట్ సర్వీసుల (ఏఈపీఎస్) లాంచ్‌తో దేశంలో తొలి అతిపెద్ద ఇంటర్ ఆపరబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అవతరించిందని ఐపీపీబీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సురేశ్ సేతి తెలిపారు. ఏ బ్యాంకుకు చెందిన కస్టమర్లు అయినా ఏఈపీఎస్ సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. కేవలం ఫింగర్‌ప్రింట్‌తో క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ విచారణ సేవలు లభిస్తాయి
పోస్ట్‌మెన్, జీడీఎస్ ద్వారా ఇంటి వద్దనే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయి దేశవ్యాప్తంగా 1,36,000 పోస్టాఫీసులు, 1,95,000 పోస్ట్‌మెన్ల ద్వారా ఐపీపీబీ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి అని వివరించారు.
ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఏఈపీఎస్ సర్వీసులతో క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలు పొందొచ్చు. మీరు ఏ బ్యాంకుకు చెందిన వారైనాసరే ఈ సేవలు లభ్యమౌతాయి. లావాదేవీని పూర్తి చేయాలంటే ఫింగర్‌ప్రింట్‌తో మీ అథంటికేషన్‌ను ధ్రువీకరించుకోవాలి


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Services to any Bank Customers in Postal Bank ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0