Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

school Admissions: Good news for students. . . Admissions in Military College.

School Admissions : విద్యార్థులకు గుడ్ న్యూస్ . . . మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు.
school Admissions: Good news for students. . . Admissions in Military College.

RIMC Entrance Exam 2020 ప్రస్తుతం ఏడాదికి రూ . 42,000 చెల్లిస్తే చాలు . భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది . అడ్మిషన్ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ . 20,000 చెల్లించాలి . విద్యాభ్యాసం పూర్తైన తర్వా త రూ 20,000 రీఫండ్ ఇస్తారు .

ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్-RIMC లో అడ్మిషన్ల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. 8వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌. 2020 జూన్ 1, 2 తేదీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుంది. అబ్బాయిలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న, పాసైన విద్యార్థులు మాత్రమే ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్‌ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి నేరుగా పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు ఫీజు డీడీ తీసి పంపాలి. ఆర్ఐఎంసీలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఫీజు సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.42,000 చెల్లిస్తే చాలు. భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది. అడ్మిషన్ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 చెల్లించాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రూ.20,000 రీఫండ్ ఇస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31
ఎంట్రెన్స్ టెస్ట్ జరిగే తేదీలు- 2020 జూన్ 1న ఇంగ్లీష్, మ్యాథ్స్, జూన్ 2న జనరల్ నాలెడ్జ్ పేపర్.
ఇంటర్వ్యూ- 2020 అక్టోబర్ 6
వయస్సు- 11.5 ఏళ్ల నుంచి 13 ఏళ్లు.
విద్యార్హత- గుర్తింపు పొందిన పాఠశాలలో 2012 జనవరి 1 నాటికి 7వ తరగతి చదువుతున్నవారు, పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.
ఎంపిక ప్రక్రియ- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్.
పరీక్ష కేంద్రం- తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడ.
ఫీజు- ఏడాదికి రూ.42,000.
స్కాలర్‌షిప్- మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 నుంచి రూ.20,000 స్కాలర్‌షిప్.
దరఖాస్తులు- www.rimc.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ప్రాస్పెక్టస్ పొందొచ్చు. లేదా "THE COMMANDANT RIMC DEHRADUN", DRAWEE BRANCH, STATE BANK OF INDIA, TEL BHAVAN, DEHRADUN, (BANK CODE-01576), TTARAKHAND. పేరుతో జనరల్ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.555 డీడీ తీసుకొని సెల్ఫ్ అడ్రస్ స్లిప్‌తో స్పీడ్ పోస్ట్‌లో ఈ కింది అడ్రస్‌కు పంపి దరఖాస్తులు పొందాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "school Admissions: Good news for students. . . Admissions in Military College."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0