Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The newest watch to assure the safety of children

పిల్లల భద్రతకు భరోసానిచ్చే సరికొత్త వాచీ
చిన్నారి ఎక్కడున్నా . . స్మార్ట్ గా చెప్పేస్తుంది !
 The newest watch to assure the safety of children

ఇప్పుడు టెక్నాలజీని భద్రతకు రక్షణకు చాలా విస్తృతంగా వాడుకుంటున్నాం . ఈ క్రమంలో . . . పిల్లల చేతికి పెడితే . . వారు ఎక్కడున్నారో తల్లిదండ్రులకు తెలిసిపోయే . . . గడియారాన్ని తయారు చేసింది ఓ కంపెనీ . సెక్యురిటీ , నిఘాలకు సంబంధించిన వస్తువులను తయారుచేసే సిపి ప్లస్ . . . ఎజీ ట్రాక్ అనే ఈ వాచీని రూపొందించింది . ఈ కిడ్స్ స్మార్ట్ వాచ్ ఎజి ట్రాక్ తో పిల్లలు ఎక్కడ ఉన్నారు , ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు . పిల్లలకు తల్లిదండ్రులకు సైతం ఉపయోగపడేలా ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు చాలా ఉన్నాయి . పిల్లల అభిరుచికి తగినట్టుగా ఈ వాచీలను పలురకాల రంగుల్లో రూపాల్లో రూపొందించారు . దీనికి తేలికగా ఉపయోగించేందుకు వీలుగా టచ్ స్క్రీన్ , పిల్లలు వేగంగా తల్లిదండ్రులకు సందేశం పంపేందుకు అనుకూలంగా ఎక్స్ట్ఎస్ ఎమర్జన్సీ బటన్ ని ఇచ్చారు . దీనిద్వారా పిల్లలు తల్లిదండ్రులు ఇరువురూ ఒకరికి ఒకరు మెసేజ్ లు పంపుకోవచ్చు , జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా కూడా తల్లిదండ్రులు పిల్లలు ఉన్న ప్రదేశాన్ని కనుగొనవచ్చు . ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా మరొకవసతి జియోఫెన్స్ అలెర్ట్ సైతం ఉంది . ఈ స్మార్ట్ వాచ్ లో ఆడ్వాన్స్ ఫీచర్లెన ఐఓఎస్ , ఆండ్రాయిడ్ యాట్లు , ఇన్ బిల్ట్ కెమెరా , వాయిస్ ఛాట్ , ఫైండ్ ఫ్రెండ్స్ , ఆడుగులను లెక్కపెట్టే పెడోమీటర్ , లో - బ్యాటరీ ఎలర్ట్ , వాచ్ తీస్తుంటే హెచ్చరించే ఎలర్ట్ . . ఉన్నాయి . ఇవి పిల్లలకే కాదు . . . . వృద్ధులకు సైతం ఎంతో ఉపయోగకరమైనవి . భవిష్యత్తు తరాల రక్షణ నిమిత్తం తయారుచేసిన ఈ వాచ్ . . పిల్లలకు రక్షణను తల్లిదండ్రులకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుందంటున్నారు దీనిని తయారుచేసిన కంపెనీ ఎండి . సాంకేతికతని సవ్యంగా వాడుకోవటంగా ఎజీ ట్రాక్ స్మార్ట్ వాచీని చెప్పవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " The newest watch to assure the safety of children"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0