Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The possibility of clarity on local elections today.

ఎన్నికలపై నేడు స్పష్టత 
ఎంపీటీసీ , జెడ్పీటీసీ , సర్పంచ్ ఎన్నికలపై విచారణ 
17నే షెడ్యూల్ ప్రకటనకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ 
సుప్రీం కోర్టు స్టేతో వాయిదా 
ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ 
 The possibility of clarity on local elections today.


 రాష్ట్రంలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ , గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఎన్నికల నిర్వహణపై గురువారం స్పష్టత రానుంది . ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది . ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఈ నెల 17నే ఎన్నికలషెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా , సుప్రీం కోర్టు స్టేకారణంగా ఆ ప్రక్రియను వాయిదా పడిన సంగతి తెలి సిందే . పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ , ఎస్పీ బీసీలకు 59 . 85శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది . అయితే 50శాతా నికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు . దీంతో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది . ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేయడంతో వాటిపై 30న విచారణ జరగనుంది . 59 . 85శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా , 50 శాతానికే పరిమితం చేయాలా , ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలు హై కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయని పంచాయతీరాజ్ శాఖకమీషనర్ కార్యాలయ అధికారులు , రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయ అధికారులు చెప్పారు .

 50 శాతానికి పరిమితం చేస్తే బీసీలకు తగ్గనున్న పదవులు

 పంచాయతీరాజ్ ఎన్నికల్లో వివిధ పదవులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిం చిన 59 . 85 శాతం రిజర్వేషన్లను హైకోర్టు 50శాతానికి పరిమితం చేస్తే ఆ మేరకు 9 . 85శాతం రిజర్వేషన్లను బీసీలకు తగ్గించాల్సి ఉంటుందని ఆధికారులు తెలిపా రు . రాజ్యాంగం ప్రకారం ఎస్సీ , ఎస్టీలకు రాష్ట్రంలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీలకు 6 .77 శాతం , ఎస్సీలకు 19 . 08శాతం తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించా ల్సి ఉంటుందని వివరించారు . ఎస్సీ , ఎస్టీలకు రిజర్వేషన్లు పోగా బీసీలకు 24 . 15 శాతం మేర రిజర్వేషన్లు కల్పించడానికి వీలుందని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కీలక అధికారు ఒకరు చెప్పారు . కాగా 59 . 85 శాతంం రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " The possibility of clarity on local elections today. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0