Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the three best post schemes in the post office.

పోస్టాఫీస్‌లో ఉత్తమ మైన మూడు పథకాలు.. వీటిలో డిపాజిట్ చేస్తే..!

ఓ వైపు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు డిపాజిటర్లు. ఈ క్రమంలో పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయడం మంచిందంటున్నారు. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌పై 4 నుంచి 8.6 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. పథకాన్ని బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఇక 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం డబ్బులు డిపాజిట్ చేయాలని భావించే వారికి పోస్టాఫీస్ మూడు అద్భుతమైన పథకాలను అందిస్తోంది. అవేంటంటే..!

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)

ఈ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇప్పుడైతే 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ మొత్తం ఏడాదికొకసారి మీ ఖాతాకు జమవుతుంది.అంతేకాదు ఈ స్కీమ్‌లో రూ.100 కూడా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి కూడా ఏం ఉండదు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్‌కు పన్ను ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌లో వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకొకసారి అకౌంట్‌కు జమవుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి 6.9 శాతం వరకు చెల్లిస్తారు. అయితే దీన్ని సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారు. ఈ అకౌంట్‌లో కనీసం రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా గరిష్ట పరిమితి ఉండదు. ఈ అకౌంట్‌ను ఐదేళ్ల వరకు కొనసాగించ వచ్చు.ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)

ఈ స్కీమ్‌పై కూడా 7.6 శాతం వడ్డీ పొందొచ్చు. ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తం అకౌంట్‌కు జమవుతుంది. అయితే ఇందులో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌కు కూడా గరిష్ట పరిమితి ఉండదు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు 9 ఏళ్ల 5 నెలల కాలంలో రెట్టింపు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం. ఈ మూడింటిలో ఏదో ఒక పథకం కింద డబ్బు డిపాజిట్ చేయండి. మంచి వడ్డీతో లాభాలు పొందండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "These are the three best post schemes in the post office."

  1. In nsa,if i deposited 1 lakh after 5years how much is available to me

    ReplyDelete
  2. In nsa,if i deposited 1 lakh after 5years how much is available to me

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0