Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Awaiting transfers This year is also disappointing for teachers

Awaiting transfers.This year is also disappointing for teachers
Awaiting transfers.This year is also disappointing for teachers

బదిలీల కోసం ఎదురుచూస్తున్న
ఉపాధ్యాయులకు ఈ ఏడాది కూడా నిరాశే
మిగలనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డక బదిలీలు ఉంటాయి అనుకుంటున్న వారి ఆశలపై నీళ్లుచల్లేందుకు సర్కార్‌ సిద్ధమయింది. ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత విద్యాశాఖతో సంబంధం ఉన్న శాఖ ఉద్యోగులను తప్ప మిగిలిన శాఖల
ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం బదిలీలు
నిర్వహించింది. ఉపా లకు మాత్రం
జరపకుండా పక్కనపెట్టింది. దీంతో ఏళ్ల తరబడి ఒకే బడిలో చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలు
కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా
ఉపాధ్యాయ బదిలీలన్లు విద్యాశాఖ చేపట్టాలి.2017లో రాష్ట్రప్రభుత్వం ఉప్తాధ్యోయులకు చివరిసారిగా బదిలీలు నిర్వహించింది. 2018-2019లో నిర్వహించలేదు. ఎనిమిదేళ్లు ఒక
పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను
విద్యాశాఖ తప్పనిసరిగా బదిలీ చేయాల్సి
ఉంటుంది.2018లో నిర్వహించక పోవడంతో కొత్తప్రభుత్వం ఏర్భడ్డ తరువాత బదిలీలు ఉంటాయని
ఉపాధ్యాయులు ఆశించారు. అయితే
విద్యాసంవత్సరం మధ్యలో ఎందుకనే భావనతో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల జోలికి వెళ్లలేదు.ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో దసరా సెలవుల్లో చేపడతామని ముందుగా విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉపాధ్యాయ
సంఘాలకు హామీ ఇచ్చి దానిని ఆచరణలోకితీసుకురాలేదు. తరువాత సంక్రాంతి సెలవుల్లో చేపడతామని ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి
చెప్పారు. సంక్రాంతి సెలవుల్లో కూడా మంత్రి బదిలీల ఊసేత్తకుండా ఉపాధ్యాయులను మరోసారి నిరాశపరిచారు. పదో తరగతి పరీక్షలకు ముందు ఆన్‌లైన్‌లో బదిలీలు నిర్వహించాలని ఉపా సంఘాలు
మంత్రివద్ద ఇటీవల ప్రతిపాదించాయి. మార్చి 23నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌లో చేపడితే 15 రోజుల్లో బదిలీల ప్రక్రియ ముగుస్తుందని, పరీక్షలు అనంతరం కొత్తవిద్యాసంవత్సరం నుంచి బదిలీ
అయినా కొత్త పాఠశాలల్లో చేరతారని మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి నుంచి ఇంతవరకు సమాధానం రాలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. త్వరలో స్థానిక సంస్థలు
ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, బదీంతో పాటు ఏప్రిల్‌లో జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఈ ఎడాది ఉపాధ్యాయ బదిలీలు చేపట్టలేమని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదినిర్వహించ లేకపోతే వచ్చే విద్యాసంవత్సరం
ముగిసిన తరువాతేనని అంటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Awaiting transfers This year is also disappointing for teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0