Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news to the unemployed ..Central government jobs in 2020

నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలివే..!
Good news to the unemployed ..Central government jobs in 2020

2020 సంవత్సర ఆరంభమే కాదు, నూతన దశాబ్ధికీ మార్గం చూపుతోంది. 2019ని సమీక్షిస్తే రాష్ట్ర స్థాయి కంటే జాతీయ స్థాయిలోనే ఎక్కువగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వేలు, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఆశించిన మేరకే నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటితో పాటు రక్షణ రంగం(నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఆర్మీ), సిఆర్‌పిఎఫ్‌, బిఎస్ఎఫ్ వంటి సైనిక దళాలు తమ తమ స్థాయుల్లో రిక్రూట్‌మెంట్లు నిర్వహించాయి. ఇదే ఒరవడి 2020లోనూ ఉండే అవకాశం ఉంది. ఏయే రంగాల్లో ఎలాంటి అవకాశాలు రానున్నాయో ఒకసారి పరిశీలిద్దాం...!

2019లో మాదిరిగానే 2020లోనూ ఇంటర్‌, డిగ్రీ ఆపై స్థాయి అర్హతలున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. స్టాఫ్‌ సెలెక్షన్‌, యూపీఎస్సీ, బ్యాంకింగ్‌ మొదలుకొని పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్ల వరకు విస్తృతంగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇవన్నీ కేంద్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలే.

బ్యాంకింగ్‌:
ఏటా ఉద్యోగాల కల్పకనలో ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్ర గణనీయం. ఒక రకంగా చెప్పాలంటే భారత ఉద్యోగ కల్పనలో సింహభాగాన్ని ఈ బ్యాంకులే నిర్వర్తిస్తున్నాయి. వీటిలో ఎస్‌బిఐ, ఆర్‌బిఐ, ఐబిపిఎస్‌, కెనరా బ్యాంక్‌, నాబార్డ్‌ వంటి సంస్థలు ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వేలాది మందిని రిక్రూట్‌ చేసుకుంటున్నాయి.

ఎస్‌బిఐ స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు:
ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌.. ఇండియా స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నియామకానికి సిద్ధమవుతోంది. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు

నోటిఫికేషన్‌ విడుదలః జనవరి 2020

వెబ్‌సైట్‌:https://sbi.co.in/web/careers

ఐబీపీఎస్:
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబిపిఎస్‌) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ విడుదలః ఆగస్టు నాలుగో వారం

ప్రిలిమినరీ పరీక్షః నవంబరు లేదా డిసెంబరు

మెయిన్స్‌ పరీక్షః 2021 జనవరి

వెబ్‌సైట్‌:https://www.ibps.in/

ఎస్‌బిఐ క్లర్క్‌
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) దేశ వ్యాప్తంగా తమ బ్రాంచీల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 28 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీః జనవరి 26

ప్రిలిమినరీ పరీక్షః మార్చి 2020

మెయిన్స్‌ పరీక్షః ఆగస్టు 2020

వెబ్‌సైట్‌:https://sbi.co.in/web/careers

ఆర్‌బిఐ ఆసిస్టెంట్‌
భారత ప్రభుత్వ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) బ్యాంక్‌ అసిస్టెంట్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీః జనవరి 16

ప్రిలిమినరీ పరీక్షః ఫిభ్రవరి 14, 15

మెయిన్స్‌ పరీక్షః మార్చి 2020


స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌:
ఏటా క్రమం తప్పకుండా నియామకాల ప్రకటనలను విడుదల చేస్తున్న బ్యాంకింగ్‌ రంగం తరవాత చెప్పుకోదగిన సంస్థ స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎ్‌ససి). 2020 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ల క్యాలెండరును ఇప్పటికే విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆఽధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో సిబ్బంది, అధికారుల నియామకాన్ని స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది.

ఎస్‌ఎస్‌సి సిజిఎల్‌:
గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సి ఏటా ‘కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌’ను నిర్వహిస్తుంది.

నోటిఫికేషన్‌ విడుదలః సెప్టెంబరు 2020

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15

వెబ్‌సైట్‌:https://ssc.nic.in/

ఎస్‌ఎస్‌సి సిహెచ్‌ఎస్ఎల్:
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డిసి)/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జెఎ్‌సఎ), పోస్టల్‌ అసిస్టెంట్‌(పిఎ)/సార్టింగ్‌ అసిస్టెంట్‌(ఎ్‌సఎ), డేటా ఎంట్రి ఆపరేటర్‌(డిఇఒ) వంటి పోస్టుల భర్తీని కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ భర్తీ చేస్తుంది. దీనికి ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీః 2020 జనవరి 10

టైర్‌-1 పరీక్షః మే 16

టైర్‌-2 పరీక్షః జూన్‌ 28

వెబ్‌సైట్‌ https://ssc.nic.in/

ఎస్‌ఎస్‌సి ఎంటిఎస్‌:
కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్‌ ‘సి’ గ్రేడ్‌(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ క్యాటగిరీ) పోస్టులైన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటిఎస్‌) భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. పదో తరగతి మొదలు డిగ్రీ ఉత్తీర్ణులైన వారి వరకు ఈ పోస్టులకు ధరకాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ కొలువును ఆశించేవారికి ఇది చక్కని అవకాశం.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభంః2020 జూన్‌ 2

టైర్‌-1 పరీక్షః అక్టోబరు 26 నుంచి

నవంబరు 13

టైర్‌-2 పరీక్షః మార్చి 1

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌:

సివిల్‌ సర్వీసెస్‌:
జాతీయ స్థాయిలో శిఖర సమానంగా భావించే ఐఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐపిఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల భర్తీకి ఏటా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యుపిఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ని నిర్వహిస్తుంది. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేన్లు మొదలవనున్నాయి. మే 31న ప్రిలిమినరీ, సెప్టెంబరు 18న మెయిన్‌ పరీక్షలను యూపిఎస్సీ నిర్వహించనుంది.

ఎన్‌డిఎః ఇండియన్‌ ఆర్మీ, నేవీ, లెఫ్టినెంట్‌, పైలెట్స్‌ వంటి పోస్టుల భర్తీ ఏటా యూపీఎస్సీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్షను నిర్వహిస్తుంది. ఇంటర్‌(ఎంపిసి) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌ చదువుతో పాటు త్రివిధ దళాల్లో ఉన్నత కొలువు కల్పించడం ఎన్‌డిఎ ప్రధాన ఉద్దేశం. ఆసక్తిగల వారు జనవరి 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు.

రైల్వే:
భారతీయ రైల్వేలు ఏటా భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఇందుకోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బి) ఏటా నోటిఫికేషన్లను విడుదల చేసి నియామక పరీక్షలను నిర్వహిస్తోంది. వీటిలో ఎన్‌టిపిసి, జెఇ పరీక్షలు ముఖ్యమైనవి.

ఎన్‌టిపిసిః జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ టైం కీపర్‌, ట్రెయిన్స్‌ క్లర్క్‌, కమర్షియల్‌- కం - టికెట్‌ క్లర్క్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, గూడ్స్‌ గార్డ్‌, సీనియర్‌ కమర్షియల్‌- కం - టికెట్‌ క్లర్క్‌, సీనియర్‌ క్లర్క్‌- కం - టైపిస్ట్‌, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కం- టైపిస్ట్‌, సీనియర్‌ టైమ్‌ కీపర్‌, కమర్షియల్‌ అప్రెంటిస్‌, స్టేషన్‌ మాస్టర్‌ వంటి పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి(నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ క్యాటగిరీ) పరీక్షను ఏటా నిర్వహిస్తుంది. ఆయా పోస్టులను భట్టి పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2020కి సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మార్చి మొదటి వారంలో మొదలు కానుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సిబిటి) సెప్టెంబరులో ఉంటుంది.

జెఇః జూనియర్‌ ఇంజనీర్‌, జూనియర్‌ ఇంజనీర్‌(ఐటి), డిపో మెటీరియల్స్‌ సూపరింటెండ్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకీ ఆర్‌ఆర్‌బి జూనియర్‌ ఇంజనీర్‌ ఎగ్జామినేషన్‌ని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన స్టేజ్‌-1 సిబిటి ఏప్రిల్‌ లేదా మేలో ఉండే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news to the unemployed ..Central government jobs in 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0