Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Measures to curb irregularities in Aadhaar centers

ఆధార్‌ కేంద్రాల్లో అక్రమాల అడ్డుకట్ట దిశగా చర్యలు.
Measures to curb irregularities in Aadhaar centers

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లోని ఆధార్‌ నమోదు కేంద్రాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉడాయ్‌ చర్యలు చేపట్టింది. 

వెయ్యికి పైగా ఉన్న ఈసేవ, మీసేవ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను ప్రభుత్వ ప్రాంగణంలోకి మార్చాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు కోరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం తప్పనిసరి. అధార్ లేనిదే ఏ పని కావడం లేదు. మరోవైపు పుట్టగొడుగుల్లా ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం అంత పెద్ద సంఖ్యలో ఈ కేంద్రాలు అవసరం లేదని ఉడాయ్‌ భావిస్తోంది.
తగిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మార్పు చేర్పులకు ఏపీలో సుమారు 1700, తెలంగాణలో 2,300 కేంద్రాలతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో స్వయంగా ఉడాయే నమోదు కేంద్రాలను నడుపుతోంది.
సమాచారం పక్కదారి పడుతోందనే ప్రచారం జరగడం, ఆధార్ కార్డ్‌ జారీ చేయడంలో అక్కడక్కడా అక్రమాలు చోటు చేసుకోవడం వంటి ఘటనలతో ఆధార్‌ కేంద్రాలన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలని ఉడాయ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ ఉడాయ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని మైహోం ప్రాంగణం నుంచి అమీర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ భవనంలోకి మార్చారు. మరోవైపు ప్రైవేటు సంస్థల నుంచి ఆధార్‌ ప్రక్రియను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇది సాధ్యం అవుతుందని అందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు చొరవ చూపుతాయని ఉడాయ్‌ అధికారులు భావిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Measures to curb irregularities in Aadhaar centers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0