Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRB Exam Fees Refund: Applied to Railway Job? RRB, which gives the Exam fee back.

RRB Exam Fees Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇస్తున్న ఆర్ఆర్‌బీ.
RRB Exam Fees Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇస్తున్న ఆర్ఆర్‌బీ.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB రీఫండ్ నోటీస్ జారీ చేసింది. పారామెడికల్ కేటగిరీలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్‌బీ జారీ చేసిన CEN 02/2019 నోటిఫికేషన్‌కు అప్లై చేసిన అభ్యర్థులకు రీఫండ్ వస్తుంది

2020 ఫిబ్రవరి 23 నుంచి ఆర్ఆర్‌బీ పారామెడికల్ కేటగిరీ నోటిఫికేషన్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఛార్జీలను రీఫండ్ చేస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. ఇందుకోసం అభ్యర్థులు ఓసారి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి పారామెడికల్ నోటిఫికేషన్ సెక్షన్‌లో బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా ఫీజు పేమెంట్ చేసినవారికి అదే అకౌంట్‌లోకి రీఫండ్ లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్, పేటీఎం ద్వారా పేమెంట్ చేసినవారు 2020 ఫిబ్రవరి 28 లోగా తమ బ్యాంకు అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది ఆర్ఆర్‌బీ. అభ్యర్థులు తమ బ్యాంకు అకౌంట్ వివరాలు సరిగ్గా అప్‌డేట్ చేయకపోతే రీఫండ్ పొందకపోవచ్చు. అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ సరిగ్గా వెల్లడించాలి.

ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫీజు రీఫండ్ కోసం బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా అందులో బ్యాంకు ఛార్జీలు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ ఫీజు మినహాయించి రూ.400 రీఫండ్ రూపంలో లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 రీఫండ్ లభిస్తుంది. పరీక్షకు హాజరైనవారికి మాత్రమే ఈ రీఫండ్ వర్తిస్తుంది. ఆర్ఆర్‌బీ జారీ చేసిన రీఫండ్ నోటీస్ కోసం

భారతీయ రైల్వేలో 1937 పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో 1,109 స్టాఫ్ నర్స్, 289 హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, 277 ఫార్మాసిస్ట్ పోస్టులు, 13 ఇతర విభాగాల పోస్టులున్నాయి. ఈ పోస్టుల నియామక ప్రక్రియ ముగిసింది. ఇక 35,000 పైగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంకా సీబీటీ 1 కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష తేదీ లేదా అడ్మిట్ కార్డులకు సంబంధించి ఆర్ఆర్‌బీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "RRB Exam Fees Refund: Applied to Railway Job? RRB, which gives the Exam fee back."

  1. I visit your blog regularly and recommend it to all of those who wanted to enhance their knowledge with ease. The style of writing is excellent and also the content is top-notch. Thanks for that shrewdness you provide the readers! job posting site

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0