Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC Civil Services 2020: Good News. . . Civil Notification Release with 796 Posts


Also Read:

CRPFలో భారీగా ఉద్యోగాలు: 1412 


Railway Jobsరైల్వేలో 570 ఉద్యోగాలు.


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

UPSC Civil Services 2020 : గుడ్ న్యూస్ . . . 796 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.
UPSC Civil Services 2020: Good News. . . Civil Notification Release with 796 Posts

UPSC Civil Services Preliminary Examination 2020  ఐఏఎస్ , ఐపీఎస్ కావాలనుకునేవారి కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది . పూర్తి వివరాలు తెలుసుకోండి .


ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి 796 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రతీసారి సుమారు 1000 వరకు పోస్టుల్ని భర్తీ చేస్తుంది యూపీఎస్‌సీ. కానీ ఈసారి 796 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేస్తుండటం విశేషం.
పోస్టుల వివరాలు
ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్-IAS, ఇండియన్ పోలీస్ సర్వీసెస్-IPS, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్-IFS,
 రైల్వే గ్రూప్ ఏ-
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ 
లాంటి పోస్టుల్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తుంది 
యూపీఎస్‌సీ. సివిల్ సర్వీసెస్ ద్వారా యూపీఎస్‌సీ భర్తీ చేసే పోస్టుల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి తగ్గింది. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. 
  పరీక్షా కేంద్రాల వివరాలు
ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తోంది యూపీఎస్‌సీ. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారు మెయిన్స్ రాయాలి. మెయిన్స్‌లో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 3 చివరి తేదీ. https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్లలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు- 796

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 12
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 3 సాయంత్రం 6 గంటలు
  • విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్
  • వయస్సు- 21 నుంచి 32 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం- ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.

ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC పైన క్లిక్ చేయండి.
Civil Services (Preliminary) Examination పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ముందుగా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి పూర్తిగా చదవాలి.
నోటిఫికేషన్ చదివిన తర్వాత తగిన అర్హతలు ఉంటే Part-I, Part-II రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC Civil Services 2020: Good News. . . Civil Notification Release with 796 Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0