Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confused rationalization

గందరగోళంగా రేషనలైజేషన్
Confused rationalization

ప్రతి స్కూల్ కు సంఖ్యతో పని లేకుండా ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం గారు సూచిస్తే చాలా సంబరపడ్డాం ఇక ప్రభుత్వ పాఠశాలను దశ... దిశ మారుతుంది అనుకున్నాం. భవిష్యత్తులోమెగా డీఎస్సీ ఉంటుందని నిరుద్యోగులు సంబరపడ్డారు... అందరి ఆశలు ఆవిరయ్యాయి....

ఉన్న పోస్టుల కి ఎసరు పెట్టారు ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం రేషనలైజేషన్ చేస్తే భారీగా ఉపాధ్యాయ పోస్టులు కోత పడటానికి అవకాశం ఉన్నది.

ఒకరు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఈ మాట తప్పా...అంతా నష్టమే ఎలాగో చూద్దాం.
ప్రస్తుతం ప్రతి పాఠశాలకు రేషనలైజేషన్ ద్వారా రెండు పోస్టులు ఇస్తామంటున్నారు కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమంటే ... ప్రతి స్కూలుకు రెండు పోస్టులు మంజూరు చేయాలి కానీ అలా చెయ్యరు.... ఉన్న పోస్ట్ లను తొలగించి సింగిల్ స్కూల్ కి సర్దుబాటు చేస్తున్నారు.... ఇప్పుడు కూడా 20 పైన ఉంటేనే డబుల్ పోస్ట్. పోస్ట్ మంజూరులో ఎటువంటి మార్పు లేదు....

మరి ఇక్కడ పోస్ట్ ఎలా సర్దుబాటు చేస్తారు?

అంటే గతంలో ఎలా ఉండేది అంటే
20 లోపు పిల్లలు ఉంటే ఒక పోస్ట్....
21 నుండి 60 వరకు ఇద్దరు...
61 నుండి 80 వరకు ముగ్గురు...
ఇప్పుడు మాత్రం ఈ సంఖ్యను 90 కి పెంచారు... ఇక్కడ ఎన్ని పోస్ట్ లు ఎపెక్ట్ అవుతాయో ఆలోచించండి....
గతంలో 81 మంది విద్యార్థులు ఉంటే LFL పోస్ట్ ఉండేది ఇప్పుడు ఆ పోస్ట్ ఉండదు....
గతంలో 100 దాటితే 4+1 ఉండేది...
ఇప్పుడు నలుగురు SGT లు...
ఈ లెక్కన అనేక పోస్టులు రద్దు కాబోతున్నాయి....
గతంలో స్కూల్ కి కచ్చితంగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు అలాగే 45 దాటితే ముగ్గురు 80 దాటితే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఆ తర్వాత ప్రతి 25 మందికి ఒక పోస్ట్ మంజూరు అన్నారు... ఈ లెక్కన భారీగా ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది.ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారుతుందని మంచి రోజులు రాబోతున్నాయని ప్రతి తల్లిదండ్రి మరియు ఉపాధ్యాయులు సంబరపడ్డారు నిరుద్యోగుల
ఆశలు చిగురించాయి కానీ అందరి ఆశలు తలకిందులు చేస్తూ రేషనలైజేషన్ పైన నిర్ణయం తీసుకోవడం  అందరిని విస్మయం కలిగించింది....

ఈ విధంగా జరిగితే ప్రభుత్వ పాఠశాల బాగు ఏమో తెలీదు గానీ... ప్రభుత్వ పాఠశాలలో మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది తద్వారా ఉపాధ్యాయులనే దోషులకు చూపిస్తూ రాబోయే రోజుల్లో విద్యను
ఏ అంబానీ కో.... ఏ ఆదానీ కో రెడ్ కార్పొరేట్ పరిచి విద్యను ప్రవేట్ పరం చేయడం తథ్యం....

నాడు నేడు కిందా
అందమైన టాయిలెట్లు ఉంటాయి.... ఆకర్షణీయమైన తరగతి గదులు ఉంటాయి.
మంచి ప్రహరీ ఉంటుంది...
కూర్చోవడానికి రంగురంగుల టేబుల్....
చల్లగా ఉండడానికి ఫ్యాను ఇవన్నీ ఉంటాయి కానీ భవిష్యత్తులో ఉపాధ్యాయులు ఉండరు. ఇవన్నీ నిరుపయోగమే అందుకే నాడు నేడు ఉపాధ్యాయ సంఖ్యతో నుండి మొదలు కావాలి.
అసలైన నాడు-నేడు అప్పుడే లేకపోతే వ్యర్థమే...
ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడూ ప్రశ్నించ లేవు...
ఈరోజు డైలీ పాఠశాలకి వెళ్ళండి అంటేనే సంఘాలను నిందిస్తున్నాం సంఘాలు ఏం చేస్తున్నాయి లే అంటూ అన్ని నువ్వే
సాధించుకున్న వాళ్ళ మాదిరిగా మాట్లాడుతున్నావ్....
రాబోయే రోజుల్లో సంఘాలే లేకుండా చెయ్యాలని పెద్ద కుట్ర జరుగుతున్నది... ఆ కుట్రలో ప్రతి ఉపాధ్యాయుడు భాగస్వామి కాబోతున్నాడు.... దయచేసి నువ్వు ఏ సంఘంలో అయినా ఉండు
మీ సంఘాన్ని అభిమానించు మీ సంఘాన్ని గౌరవించు వ్యక్తులు నచ్చకపోవచ్చు అలా అని మొత్తం ఆ సంఘాన్నే మనం దూషించకూడదు.... సంఘాన్ని మాత్రం అభిమానించాలి అది ఏ సంఘమైన సరే మన హక్కులను కాపాడుతుంది...
ఇప్పటికే మన సంఘాలు అనేక ప్రయోజనాలను చేకూర్చాయి మనం వాటిని అనుభవిస్తూ దర్జాగా ఉన్నాం కానీ భవిష్యత్తు   అలా ఉండబోదు...

ఇప్పుడు స్తబ్దంగా ఉండి నాకు బదిలీ జరిగితే చాలు అని బదిలీల మీద ఆశ పెట్టుకొని ఉంటే ఇదే నీకు చివరి బదిలీ కాబోతుంది...కావున ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుడు
ఆపైన ప్రతి 25 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా మన సంఘాలతో కలిసి పోరాటం చేద్దాం... రేషనలైజేషన్ లేట్ అయితే బదిలీలు ఆలస్యం అవుతాయి అనే ఆలోచన విడనాడు... విజ్ఞతతో ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని మనవి.
లేదంటే భవిష్యత్ మనల్ని క్షమించదు....

విజయ్ కుమార్ అలంకారం వారి వాల్ నుంచి సేకరించబడింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confused rationalization"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0