Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do tenth class examinations happen?

పది పరీక్షలుజరిగేనా?
Do tenth class examinations happen?

రద్దు చేయాలని డిమాండ్‌
పెరుగుతున్న కరోనా కేసులు
నిర్వహణ కష్టమనే అభిప్రాయం.

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థుల్లో పరీక్షలు నిర్వహించకుండా... తెలంగాణ తరహాలో విద్యార్థులకు గ్రేడ్‌లు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండడం, కంటైన్మెంట్‌ జోన్‌లు విస్తరిస్తున్న నేపథ్యంలో... పరీక్షల రద్దువైపే మొగ్గుచూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ పదిపరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్‌ అసెన్మెంట్ (అంతర్గత) పరీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఏపీలోనూ ఇదేడిమాండ్‌ వినిపిస్తోంది. దీనికితోడు పరీక్షల రద్దుకు మానవ హక్కుల కమిషన్‌లోనూ పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల పది పరీక్షల నిర్వహణపై పేరెంట్స్‌ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈవోలతో మంత్రి సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులోనూ పరీక్షల రద్దువైపే ఎక్కువమంది మొగ్గు చూపారు. మరోవైపు నాడు-నేడు పనులు జరిగే పాఠశాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. పనుల నిర్వహణతో పరీక్షలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో. పరీక్షల రద్దుకే విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార వర్గాలను సంప్రదించగా... ‘‘ఇప్పటికైతే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఏర్పాట్లలో మేమున్నాం. పరీక్షలు రద్దు అవుతాయనే సంకేతాలు మాకైతే లేవు. ప్రభుత్వంతీసుకునే నిర్ణయమే అంతిమం’’ అని తెలిపారు.

పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు, శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Do tenth class examinations happen?"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0