Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers in confusion

అయోమయం లో ఉపాధ్యాయులు
Teachers in confusion


  • అధికారులు వెల్లమంటే..ఊరు వద్దంటే ఎక్కడికి పోవాలి..?
  • మండుటెండలో...నడిరోడ్డు మీద ఉపాధ్యాయులు
  • అధికారుల ఉత్తర్వులతో గందరగోలంలో అయ్యవార్లు

  • క్వారంటైన్, కంటైన్మెంట్ జోన్లలో  పనిచేస్తున్న మరియు నివాసముంటున్న టీచర్ల రాకపోకలు అడ్డుకుంటున్న అధికారులు.. కొన్నిచోట్ల గ్రామస్థులు...
  • నిన్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్&డైరెక్టర్ వారు ఇచ్చిన ఉత్తర్వులు(145) ప్రాప్తికి వెళ్లగలిగిన వాళ్ళు నిన్నే కొందరు పాఠశాలకు వెళ్లారు,
  • ఆ ఉత్తర్వులు వెలువడటమే మధ్యాహ్నం 2-30 గంటలకు కావడంతో ఈ రోజు అందరూ బయల్దేరారు. విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులను బడిలో కూర్చోమనడంతో అందరూ విస్తుపోయారు. 
  • అయిన అధికారుల అదేశాలను పాటిస్తూ వెళ్లినా... ఒక వింత అనుభూతి ఎదురయ్యిందని పేర్కొన్నారు.
  • పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోయినా వ్యయప్రాయసాలు పడి ఉపాధ్యాయులు స్కూళ్లకు చేరుకున్నారని,అయితే కంటైన్మెంట్, క్వారంటైన్ జోన్లలో  ఉన్నవారిని గ్రామాల సరిహద్దుల్లో వేసిన బారికేడ్లను అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య, పోలీసు, సచివాలయ ఉద్యోగులు దాటనివ్వలేదని అదేవిధంగా ఫ్రీ జోన్ నుండి వెళ్లిన ఉపాధ్యాయులను రెడ్ జోన్లలోకి అనుమతించలేదని తెలియజేశారు.
  • ప్రస్తుతం నలభై శాతం పాఠశాలల్లో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి అక్కడ కనీసం మరుగుదొడ్లు కూడా లేవు మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
  • అలాగే క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ ఎసింప్టమాటిక్ రోగులు వినియోగిస్తున్నారని విద్యార్థులు లేకున్నా తరగతులు బోధించకున్నా ఉదయం నుండి సాయింత్రం వరకూ ఉన్న ఉపాధ్యాయులు ఆ మరుగుదొడ్లు వాడాలంటే భీతిరిల్లిపోతున్నారని ఆందోళన వ్యక్తపరిచారు.
  • కమీషనర్ చినవీరభద్రుడు గారు ఇచ్చిన ఉత్తర్వులు అటు కేంద్ర మానవవనరుల శాఖామంత్రి సురేష్ పొక్రియాల్ చేసిన ప్రకటనకు ("విద్యాసంవస్థలు ఎప్పుడు పునఃప్రారంభం చెయ్యాలో ఆగస్టు 15 తరువాత ప్రకటిస్తామని అన్నారు") 
  • ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆగస్టు మూడు లేదా ఆగస్టు ఎనిమిదిన రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభించడానికి యోచిస్తున్నట్లు ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ ఈ రెండింటికీ భిన్నంగా ఉత్తర్వులు జారీచేశారని.అసలు విద్యాశాఖలో పూటకో జి ఓ విడుదల చేస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారరని ఈ ఉత్తర్వులపై పునఃసమీక్షించాలని  డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers in confusion"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0