Identity Cards for Teachers
గురువులకు గుర్తింపు కార్డులు
సర్కారీ బడుల ఉపాధ్యాయులకు అందజేత
ఏలూరు వార్త: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా నిధులను గత ఏడాది బడ్జెట్‌లోనే కేటాయించింది. పలు కారణాల రీత్యా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ముందుకు సాగలేదు.
జిల్లాలో 13,842 మంది ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను అందజేయనున్నారు. ప్రభుత్వం ఒక్కో కార్డు తయారీకి రూ.50 చొప్పున విడుదల చేసింది. తయారు చేయించడం కోసం జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ) ఆధ్వర్యంలో ఇటీవల టెండర్లు పిలవగా నాలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందులో ఒక సంస్థ అతి తక్కువగా రూ.37 కోట్ చేసింది. ఇది కేవలం కార్డు తయారీకి మాత్రమే అని సదరు సంస్థ పేర్కొంది. అయితే కార్డుతో పాటు ట్యాగ్‌నూ ఇవ్వాలంటూ డీపీసీ ప్రతినిధులు కోరగా అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
గుర్తింపు కార్డులో ఉపాధ్యాయుని పేరు, యూడైస్ కోడ్, పుట్టిన తేదీ, పాఠశాల చిరునామా తదితర వివరాలతో పాటు ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియను త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత గుర్తింపు కార్డులను జారీ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
తగిన గుర్తింపు
ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను జారీ చేయడం ద్వారా వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారు పాఠశాలకు విధిగా వాటితో హాజరు కావాలి.
అధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు ప్రాథమిక సమాచారాన్ని దస్త్రాల్లో పరిశీలించకుండా గుర్తింపు కార్డుల ద్వారా తెలుసుకునే వీలుంటుంది. కార్డుల తయారీ టెండర్ల ప్రక్రియ డీపీసీ ఆమోదంతో త్వరలోనే పూర్తి కానుంది.
సీవీ రేణుక గారు, డీఈవో

0 Response to "Identity Cards for Teachers"
Post a Comment