Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Parents say schools should not open in September

సెప్టెంబర్ లో స్కూల్స్ తెరవవద్దు అంటున్న పేరెంట్స్
Parents say schools should not open in September

కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు.

ఎక్కువ శాతం తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ మంచిదేనా? అసలు పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనే దానిపై 'లోకల్‌ సర్కిల్స్‌' దేశవ్యాప్త సర్వే నిర్వహించింది.

ఎక్కువ శాతం మంది తెరవకపోతే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. భారతదేశంలోని 252 జిల్లాల్లో 25 వేల మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

వీరిలో 63% పురుషులు, 37% మహిళలు ఉన్నారు.

ఇంకా వైరస్ కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సగటును 65 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ. కేవలం 20 రోజుల వ్యవధిలో ఏకంగా కేసులు 20 లక్షలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో స్కూల్స్ తెరిస్తే..పిల్లల నుంచి మొత్తం కుటుంబానికి వైరస్ సోకే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఇంకా..స్కూల్స్ తెరవడానికి 10 నుంచి 12 రోజుల సమయం ఉంది. ఈ రోజుల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Parents say schools should not open in September"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0