Teachers' expectations for transfers
ఎప్పుడెప్పుడా!..
బదిలీలకై ఉపాధ్యాయుల ఎదురుచూపులు
టీచర్ బదిలీలకు కొత్త ప్రామాణికత.....
వెబ్ కౌన్సెలింగా? మాన్యువల్ కౌన్సెలింగా?సందిగ్ధం
జనాభా లెక్కలు, ఎన్నికల విధుల బదిలీలకు అడ్డంకి....
ముఖ్యమంత్రి వద్ద ఫైల్ పెండింగ్....
మచిలీపట్నం:
బదిలీ ఉత్తర్వుల కోసం ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. సెప్టెం బరు 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపద్యంలో ఈలోగానే బదిలీలు పూర్తి కావాలనే ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు. జూలై 1వ తేదీన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ ఈ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా వెబ్ కౌన్సెలింగ్ లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలి అని చర్చలు సాగినట్లు తెలిసింది. దీనిపై తుది నిర్ణయం జరగలేదు. బదిలీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి వద్ద సంబంధిత ఫైలుకు ఆమోదం పొందడమే మిగిలిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మాన్యువల్ కౌన్సెలింగ్ వైపు ఉపాధ్యాయులు
2017లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశారు. ఈసారి బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ లేదా మాన్యువల్గా బదిలీలు చేయాలా అనే అంశంపై ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంగీకరించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగితే కోరుకున్న ప్రాంతానికి సీనియారిటీ ఉన్న టీచర్ వెళ్లలేకపోతున్న నేపథ్యంలో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతిపాదించారు. స్కూల్ అసిస్టెంట్లు తక్కువ సంఖ్యలో ఉంటే వారికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించి సెకండరీ గ్రేడ్ టీచర్ అధికంగా ఉంటే వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఉపాధ్యాయ సంఘాలనాయకులు తెలిపారు. ఈ అంశంపై ఎటూ తేల్చకుండానే అధికారులు నాన్చుడు ధోరణిలో ఉన్నారని టీచర్ చెబుతున్నారు
జనాభా లెక్కల విధులకు ఆటంకమవుతాయా...
2021 జనాభా లెక్కల ప్రక్రియ నిమిత్తం ఉపాధ్యాయులకు డ్యూటీలు వేశారు. 2019 సెప్టెంబరు నాటికి ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతాల వివరాలను సేకరించారు. కరోనా వైరస్ ప్రభావంతో జనాభా లెక్కల ప్రక్రియ నిలిచిపోగా, ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని స్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లోనూ ఉపాద్యాయులను నియమించారు. ఈ రెండూ ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాస్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే బదిలీలకు ఉన్న ఆటంకాలు తొలగుతాయని ఉపాధ్యాయులు అంటున్నారు
ఉపాధ్యాయ బదిలీల్లో గతంలో పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించారు, ఈసారి బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సర్వీసును బట్టి ఏడాదికి ఆర పాయింటు కేయిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏడాదికి ఒక పాయింటు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు
ఉపాధ్యాయులు పనిచేస్తున్న ప్రాంతాల్లో అమలు చేస్తున్న హెచ్ ఆర్ ఏ బట్టి పాయింట్లు కేటాయించనున్నారు.శాతం హెచ్ ఆర్ ఏ 1వ కేటగిరీగా పరిగణించి ఒక పాయింట్, 14.5 హెచ్ఆర్ ఏ ఉంటే 2వ కేటగిరీగా చూపి పాయింట్లు, 12 శాతం హెచ్ ఆర్ ఏ ఉంటే 3 కేటగిరీగా చూపి 3 పాయింట్లు, పాఠశాలకు 3 కిలో మీటర్ల వరకు రోడ్డు మార్గం లేకుంటే 4 కేటగిరీ కింద చూపి 4 పాయింట్లు కేటాయించాలని నిర్ణయించారు
నాలుగో కేటగిరీ జిల్లాలో అతి తక్కువగా ఉంటాయని ఉపాధ్యాయులు అంటున్నారు. వైకల్యంతో బాధపడే ఉపాధ్యాయులకు పాయింట్లతో లేకుండా మొదటిప్రాధాన్యతలో బదిలీలు చేసేవారు
40 శాతం వైకల్యం ఉన్న వారికి, 80 శాతం వైకల్యం ఉన్నవారికి ఒకే నిబంధనలు అమలు చేయడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీని ఫలితంగా 40 శాతం వైకల్యం ఉన్నవారికి పాయింట్లు కేటాయించి, 70 నుంచి 80 శాతం వైకల్యం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతలో చోటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకుల సూచన మేరకు ఈసారి జరిగే బదిలీలు మార్పులు వేయనున్నారు.
వితంతువులు, విడాకులు తీసుకున్న, వివాహం కాని టీచర్లకు మొదటి ప్రాధాన్యతలోనే అవకాశం కల్పిస్తారు.

0 Response to "Teachers' expectations for transfers"
Post a Comment