Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CSAB Special Round for NITs, IIITs and GFTIs -2020

ఎన్‌ఐ‌టి, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్.

CSAB Special Round for NITs, IIITs and GFTIs -2020

ఎన్‌ఐ‌టి, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జి‌ఎఫ్‌టి‌ఐ ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ అథారిటీ (సీఎస్ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐ‌టి , ట్రిపుల్‌ఐటీ, జి‌ఎఫ్‌టి‌ఐ ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషనల్ అథారిటీ (జోసా) గత నెల 6వ తేదీ నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. దీంతో జోసా చేపట్టిన ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తవుతుంది. అయితే ఈ కౌన్సెలింగ్ తరువాత ఎన్విటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ టీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్ఏబీ షెడ్యూల్‌ను జారీ చేసింది.

షెడ్యూల్‌ వివరాలు

  • 16-11-2020: జోసాలో మిగిలిపోయిన సీట్ల వివరాలు ప్రకటన
  • 17-11-2020 నుంచి 19-11-2020: రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఛాయిస్ ఫిల్లింగ్
  • 20-11-2020: సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విడత-1 సీట్ల కేటాయింపు
  • 20-11-2020 నుంచి 28-11-2020 వరకు: సీట్ యాక్సెప్షన్స్, సీట్ల సరెండర్, ఆన్లైన్ రిపోర్టింగ్
  • 25-11-2020: ప్రత్యేక విడత-2 సీట్ల కేటాయింపు
  • 25-11-2020 నుంచి 27-11-2020: సీట్ యాక్సెప్టెన్స్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ల అప్లోడ్
  • 25-11-2020 నుంచి 30-11-2020 వరకు: రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ రిపోర్టింగ్.

CSAB-2020 SPECIAL ROUNDS SCHEDULE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CSAB Special Round for NITs, IIITs and GFTIs -2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0