Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rethink the start of schools

స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి

Rethink the start of schools

స్కూళ్లలో విజృంభిస్తోన్న కరోనా.

సీఎంకు అనగాని, సీపీఐ లేఖలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై పునరాలోచన చేయాలని  ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారిరువురూ విడివిడిగా సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున పాఠశాలలు నడిపి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. 

స్కూళ్లలో విజృంభిస్తోన్న కరోనా

ప్రకాశం :

 జిల్లాలోని పాఠశాలల్లో వరుసగా నాల్గవ రోజు కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ముగ్గురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయునికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ప్రారంభం అయినప్పటి నుండి 13 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు కరోనా భారిన పడ్డారు. కాగా, జిల్లాలోని ముండ్లమూరు మండలం భీమవరంలో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే విద్యార్థులెవరూ స్కూళ్లకు రాకపోవటంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలనను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అనంతపురం: 

రాష్ట్రంలో స్కూల్ పున:ప్రారంభంతో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అనంతలో 59 మంది ఉపాధ్యాయులు, 18 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  16736 మంది ఉపాధ్యాయుల్లో 14424 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... వారిలో 59 మంది ఉపాద్యాయులకు పాజిటివ్‌గా అని తేలింది. అలాగే 1212 మంది విద్యార్థినీ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయగా...18 మంది కరోనా బారిన పడినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు

ఏలూరు

విద్యార్థులను వదలని కరోనా

మరో 29 మంది సహా.. తొమ్మిది మంది టీచర్లకు పాజిటివ్‌

పాఠశాలలకు హాజరు అంతంతమాత్రమే

ఏలూరు ఎడ్యుకేషన్‌, : పాఠశాలలు, కళాశాలలకు కరోనా కేసులు క్రమేణా వ్యాపిస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లను వైరస్‌ వదలడం లేదు. పది రోజులుగా పాఠశాలల్లో నిర్వహించిన కొవిడ్‌ టెస్టుల్లో జిల్లాలో 262 మంది విద్యార్థులకు, 172 మంది టీచర్లకు పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా గురువారం మరో 29 మంది విద్యార్థులతోపాటు తొమ్మిది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. పోడూరు మండలం పెదపాలెం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, యలమంచిలి మండలం చించినాడ జడ్పీ హైస్కూలులో ముగ్గు రు, నల్లజర్ల మండలం శింగరాజపాలెం జడ్పీ హైస్కూల్లో 12 మంది, పెదవేగి మండలం కూచింపూడి జడ్పీ హైస్కూలులో పది మంది, దెందులూరు మండలం మేదినరావుపాలెం జడ్పీ హైస్కూలు, టి.మెరక ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొ క్క విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణయింది. కళాశాల ల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన కరోనా టెస్టు ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. టీచర్లలో తాజాగా బుట్టాయి గూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, యర్నగూడెం, కూచింపూడి, తాడేపల్లి గూడెంలలోని జడ్పీ హైస్కూళ్ళు,  కుక్కునూరు కేజీబీవీలలో ఒకొక్కరు చొప్పున, శింగరాజపాలెం జడ్పీ హైస్కూలులో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  కొవిడ్‌ భయాందోళన దృష్ట్యా తరగతులకు విద్యార్థుల హాజరు సంఖ్య చాలా తక్కువ గా ఉంది. గురువారం తొమ్మిదో తరగతి విద్యార్థులు 4,273 మంది, పదో తరగతి 10,135 మంది, సీనియర్‌ ఇంటర్‌ 4,279 మంది హాజరయ్యారు.  ఈ మూడు తరగతులకు జిల్లాలో 1,48,177 మంది విద్యార్థులుండగా, 18,687 మంది మాత్రమే తరగతులకు వెళ్లారు

గుంటూరు: 25 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌

భయపడినట్లే జరుగుతోంది. బడులపై కరోనా ప్రతాపం చూపుతోంది. ప్రభుత్వ సూచనల మేరకు తెరిచిన పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సాధారణ పరీక్షల్లో ఇప్పటికి 25 మంది ఉపాధ్యా యులకు పాజిటివ్‌ అని తేలింది.  వెల్లటూరులో ఓ విద్యార్థికి అతడి ద్వారా తండ్రికి పాజిటివ్‌ వచ్చి నట్లు వైద్యులు గుర్తించారు. ముందు, వెనకా పెద్దగా ఆలో చన చేయకుండా అనుకొన్నదే తడవుగా పాఠ శాలలు తెరవడం వల్లే కరోనా వెంటాడుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పాఠశాలల్లో పిల్లలు, ఉపాధ్యా యులందరికీ టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్‌ రేటు ఏ స్థాయిలో ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

దశలవారీగా ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కరోనా వైరస్‌ వ్యాప్తికి ఊతంగా మారే అవకాశం ఉందని పలువురు గతంలో హెచ్చరించారు. బుధవారంతో పాఠ శాలలు తెరిచి మూడు రోజులే. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని పాఠశాల

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rethink the start of schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0